ఆ సామజిక వర్గానికి జగన్ 250 యూనిట్ల ఉచిత విద్యుత్ హామీ!

ఆ సామజిక వర్గానికి జగన్ 250 యూనిట్ల ఉచిత విద్యుత్ హామీ!
x
Highlights

వైసీపీ అధినేత వైయస్ జగన్ తన పాదయాత్రలో పలు సామజిక వర్గాలకు వివిధ హామీలు ఇస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తున్న జగన్ ...

వైసీపీ అధినేత వైయస్ జగన్ తన పాదయాత్రలో పలు సామజిక వర్గాలకు వివిధ హామీలు ఇస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తున్న జగన్ తాజాగా నాయీబ్రాహ్మణ ఆత్మీయ సభలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా వారికి ఉచిత విద్యుత్ హామీ ఇచ్చారు. తాము అధికారంలోకి వస్తే నాయీబ్రాహ్మణుల సెలూన్‌ షాపులకు 250 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్‌.. లేదా సెలూన్‌కు ఏడాదికి రూ.10 వేల సాయం ఇస్తామని హామీ ఇచ్చారు. అంతేకాకుండా తాము అధికారంలోకి వచ్చిన వెంటనే నాయీబ్రాహ్మణులకు ప్రత్యేకంగా కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి తక్కువ వడ్డీకే రుణాలు ఇచ్చేందకు కృషి చేస్తామన్నారు. ఇక దేవాలయాల్లో పనిచేస్తున్న నాయీబ్రాహ్మణులకు సరిగా జీతం అందడం లేదన్న జగన్ వారికీ గుర్తింపు కార్డు ఇచ్చి నెల నెల సరిగా జీతాలు అందేందుకు చర్యలు చేపడతామన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories