logo
జాతీయం

బోటులో మంటలు.. సముద్రంలోకి దూకిన నలుగురు..

బోటులో మంటలు.. సముద్రంలోకి దూకిన నలుగురు..
X
Highlights

గుజరాత్‌ తీరంలోని భావ్‌నగర్‌ ఐస్‌లాండ్‌ సమీపంలో ఓ బోటు ప్రమాదానికి గురైంది. ప్రయాణిస్తున్న బోటులో నుంచి...

గుజరాత్‌ తీరంలోని భావ్‌నగర్‌ ఐస్‌లాండ్‌ సమీపంలో ఓ బోటు ప్రమాదానికి గురైంది. ప్రయాణిస్తున్న బోటులో నుంచి అకస్మాత్తుగా మంటలు వ్యాపించాయి. ప్రాణభయంతో నలుగురు ప్రయాణికులు సముద్రంలో దూకడంతో గల్లంతయ్యారు. వీరి ఆచూకీ కోసం కోస్ట్‌గార్డు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టింది. మరోవైపు బోటులో చిక్కుకుపోయిన మరికొంత మంది ప్రయాణికులను కోస్ట్‌గార్డు సిబ్బంది సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. కాగా బోటులో ముందుగా పేలుడు శబ్దం సంభవించి ఆ తరువాత మంటలు చెలరేగాయని అందులోని ప్రయాణికులు చెబుతున్నారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు దర్యాప్తునకు ఆదేశించారు.

Next Story