అచ్చం భూమిని పోలిన నాలుగు కొత్త గ్రహాలు

Highlights

అచ్చం భూమిని పోలిన నాలుగు కొత్త గ్రహాలను కనుగొన్నారు శాస్త్రవేత్తలు. భూమికి 12 కాంతి సంవత్సరాల దూరంలో టావు సెటీ అనే సూర్యుడి తరహా నక్షత్రం చుట్టూ ఇవి...

అచ్చం భూమిని పోలిన నాలుగు కొత్త గ్రహాలను కనుగొన్నారు శాస్త్రవేత్తలు. భూమికి 12 కాంతి సంవత్సరాల దూరంలో టావు సెటీ అనే సూర్యుడి తరహా నక్షత్రం చుట్టూ ఇవి తిరుగుతున్నట్లు అమెరికాలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయ పరిశోధకులు గుర్తించారు. ఏ పరికరం సాయం లేకుండా సాధారణంగానే మానవులు ఈ నక్షత్రాన్ని చూడవచ్చని పేర్కొన్నారు. ఈ కొత్త గ్రహాల ఉపరితలంపై ద్రవరూపంలోనే నీటిని నిల్వ చేసుకునేందుకు అవకావం ఉన్నాయని చెబుతున్నారు. కనీసం భూమికి 1.7 రెట్లు ఎక్కువ ద్రవ్యరాశితో ఈ గ్రహాలున్నాయని.. ఇప్పటివరకూ సూర్యుడి లాగా నక్షత్ర కుటుంబాల్లో కనుగొన్న గ్రహాల్లో అతి చిన్నవి ఇవేనని తెలిపారు. టావు సెటీ గమనంలో చోటు చేసుకుంటున్న కదలికలను విశ్లేషించడం ద్వారా వీటిని గుర్తించామన్నారు. సెకనుకు 30 సెం.మీ.లు లాంటి సున్నితమైన కదలికలను సైతం పసిగట్టగల టెక్నాలజిని ఉపయోగించడం ద్వారా ఇది సాధ్యమైందిని వెల్లడించారు. భూమి లాంటి గ్రహాల అన్వేషణకు సంబంధించి ఇది ఒక మైలురాయిగా వారు అభివర్ణించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories