జగన్‌ను కలిసిన మాజీ ఎమ్మెల్యే

జగన్‌ను కలిసిన మాజీ ఎమ్మెల్యే
x
Highlights

వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ప్రధాన ప్రతిపక్షనేత వైయస్ జగన్‌మోహన్‌రెడ్డిని గజ పతినగరం మాజీ ఎమ్మెల్యే తాడ్డి సన్యాసప్పలనాయుడు కలిశారు. ప్రజాసంకల్ప...

వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ప్రధాన ప్రతిపక్షనేత వైయస్ జగన్‌మోహన్‌రెడ్డిని గజ పతినగరం మాజీ ఎమ్మెల్యే తాడ్డి సన్యాసప్పలనాయుడు కలిశారు. ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా గజపతినగరంలో ఏర్పాటు చేసిన జగన్ శిబిరం వద్ద శనివారం ఉదయం జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా తాడ్డి సన్యాసప్పలనాయుడును ఆరోగ్యం ఎలా ఉందంటూ జగన్‌మోహన్‌రెడ్డి అడిగారు. అయన బాగానే ఉందని సమాధానమిచ్చారు. 2004 నుంచి వైయస్ అంటే తమకు ఎంతో అభిమానమని, మీ కుటుంబానికి ఎప్పుడూ మా అండదండలు ఉంటాయని జగన్‌మోహన్‌రెడ్డికి మాజీ ఎమ్మెల్యే సన్యాసప్పలనాయుడు తెలిపారు. ఆయనతో పాటు పార్టీ సీనియర్‌ నాయకుడు, గజపతినగరం ఇంచార్జి పెనుమత్స సాంబశివరాజు ఉన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories