ఇటు విషాదం.. అటు దొంగతనం..ఠాగూర్ సీన్ రిపీట్..!

ఇటు విషాదం.. అటు దొంగతనం..ఠాగూర్ సీన్ రిపీట్..!
x
Highlights

చికిత్స కోసం ఆసుపత్రికి వచ్చిన రోగిని కాటేసింది వైద్యం. సరైన సమయంలో వైద్యం అంధక. చేసిన ఆపరేషన్ కాస్త వికటించడంతో మహిళ ప్రాణం బలై పోయింది. వివరాల్లోకి...

చికిత్స కోసం ఆసుపత్రికి వచ్చిన రోగిని కాటేసింది వైద్యం. సరైన సమయంలో వైద్యం అంధక. చేసిన ఆపరేషన్ కాస్త వికటించడంతో మహిళ ప్రాణం బలై పోయింది. వివరాల్లోకి వెళితే మంచిర్యాల జిల్లా మారుతీనగర్ కు చెందిన అభిష్ట వరప్రదాయిని(35) అటవీశాఖలో డిప్యూటీ రేంజ్‌ అధికారిణిగా పనిచేస్తున్నారు. కొద్ది రోజులు గా థైరాయిడ్‌ సమస్యతో బాధపడుతున్నారు. తెలిసిన డాక్టర్ల వద్దకు వెళ్లి చికిత్స చేయించుకుంది. కానీ ఫలితం లేకపోయింది. చివరకు మంచిర్యాలలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కు భర్తతో కలిసి వచ్చింది. ఆమెను పరిశీలించిన డాక్టర్లు చికిత్స చేయించుకోవాల్సిందింగా సూచించారు. వారి సూచన మేరకు ఆపరేషన్ కోసం కొంత డబ్బు కట్టిన ఆమె భర్త శ్రీనివాసరావు ఎలాగైనా తన భార్యకు వ్యాధి నయం చేయమని డాక్టర్లను వేడుకున్నాడు. మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో వరప్రదాయిని ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్లారు. ఇద్దరు ప్రభుత్వ వైద్యురాళ్లను కూడా పిలిపించి గంటలో ఆపరేషన్ అయిపోతుందని శ్రీనివాసరావు కు తెలియజేశారు.. కానీ రాత్రి ఏడుగంటలు అవుతున్నా వరప్రదాయిని చూపించలేదు ఇదేంటని సిబ్బందిని ప్రశ్నించగా అప్పుడే హడావుడి ప్రారంభించారు. మందులు తీసుకురండి.. రక్తం కావాలి.. ఈసీజీ మిషన్‌ తేవాలి.. ఆక్సిజన్‌ పెట్టాలి’ అంటూ కొద్దిసేపు హడావుడి సృష్టించారు. ఇంతలో రాత్రి తొమ్మిది అయింది అప్పుడు కూడా శ్రీనివాసరావు ను ఆపరేషన్ థియేటర్ లోకి వెళ్లనివ్వలేదు. దీంతో అనుమానం చెందిన శ్రీనివాసరావు బంధువులకు ఫోన్ చేసి ఆసుపత్రి వద్దకు రమ్మన్నాడు. బలవంతంగా ఆపరేషన్ థియేటర్ లోకి వెళ్లి వరప్రదాయిని చూడగా ఆమె చలనం లేకుండా పడివుంది. కొద్దిసేపటికి ఆమె మృతిచెందినట్టు నిర్ధారించుకున్నారు. ఈ క్రమంలో ఆసుపత్రి యాజమాన్యం వద్దకు వెళ్లి సంప్రదించగా వారు నిర్లక్షంగా వ్యవహరించారు. ఆపరేషన్‌ సరిగా చేయకుండా తన భార్యను చంపేశారంటూ రోదించారు. అతడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆసుపత్రి నిర్వాహకులు, వైద్యులపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఇదిలావుంటే అసలే భార్య మరణించి పుట్టెడు దుఃఖంలో ఉన్న శ్రీనివాసరావు.. ఇంట్లో దొంగతనం జరిగింది.ఇంట్లో ఎవరు లేని సమయాన్ని చూసిన దొంగలు చోరీకి పాల్ప డ్డారు. 23 తులాల బంగారు ఆభరణాలు, రూ.19 వేల నగదును దోచుకుపోయినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. దీంతో అందరికి అందుబాటులో వుండే శ్రీనివాస రావు కుటుంబానికి వచ్చిన కష్టాన్ని చూసి స్థానికులు విచారం వ్యక్తం చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories