ప్రపంచవ్యాప్తంగా ఒకేఒక్కడు..

ప్రపంచవ్యాప్తంగా ఒకేఒక్కడు..
x
Highlights

ప్రపంచవ్యాప్తంగా ఒకేఒక్కడు.. ఈ టైటిల్ కు భారత్ క్రికెట్ రధసారధి విరాట్ కోహ్లీ ఒక్కరే సరిపోతారేమో.. ఏటాప్రకటించే ఫోర్బ్స్‌ టాప్‌-100 క్రీడాకారుల జాభితా...

ప్రపంచవ్యాప్తంగా ఒకేఒక్కడు.. ఈ టైటిల్ కు భారత్ క్రికెట్ రధసారధి విరాట్ కోహ్లీ ఒక్కరే సరిపోతారేమో.. ఏటాప్రకటించే ఫోర్బ్స్‌ టాప్‌-100 క్రీడాకారుల జాభితా బుధవారం వెలువడింది. అందులో క్రికెట్ నుంచి ప్రపంచవ్యాప్తంగా విరాట్‌కు 83వ స్థానం దక్కింది. దీంతో క్రికెట్ నుంచి ఈ జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక క్రికెటర్ కోహ్లీ అయ్యాడు. గత ఏడాది 89వ స్థానంలో ఉన్న విరాట్‌.. ఈసారి ఆరు స్థానాలు ఎగబాకాడు. అతడి వార్షికాదాయం 24 మిలియన్‌ డాలర్లు (సుమారు రూ.160 కోట్లు). కాగా ప్రముఖ బాస్కెట్‌బాల్‌ ప్లేయర్ మార్క్‌ గాసోల్‌ 23.7 మిలియన్ల ఆదాయంతో (84వ స్థానం,)లో ఉండగా టెన్నిస్‌ క్రీడాకారుడు నొవాక్‌ జకోవిచ్‌ 23.5 మిలియన్ల తో(86), ఫుట్‌బాల్‌ స్టార్‌ సెర్జియో అగెరో 23.5 మిలియన్ల తో(86)స్థానాల్లో చోటు దక్కించుకున్నారు. ఇదిలావుంటే వార్షికాదాయం 285 మిలియన్‌ డాలర్లు (సుమారు రూ.1837 కోట్లు) తో బాక్సర్‌ ఫ్లాయిడ్‌ మేవెదర్‌ అగ్రస్థానంలో ఉన్నాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories