టీడీపీ-బీజేపీ పొత్తుపై గుంటూరులో ఫ్లెక్సీ కలకలం
Highlights
ఇప్పటికే ఏపీలో టీడీపీ, బీజేపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయ్. కేంద్ర ప్రభుత్వం నుంచి ఏపీకి ఎలాంటి సహకారం...
arun3 Feb 2018 6:40 AM GMT
ఇప్పటికే ఏపీలో టీడీపీ, బీజేపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయ్. కేంద్ర ప్రభుత్వం నుంచి ఏపీకి ఎలాంటి సహకారం లేదని టీడీపీ నేతలు అంటుంటే, తప్పంతా టీడీపీదే అని బీజేపీ నేతలు మండిపడుతున్నారు. తాజాగా, కేంద్ర బడ్జెట్ లో ఏపీకి మొండిచేయి చూపించడంతో, టీడీపీ నేతల్లో ఆగ్రహం మరింత ఎక్కువైంది. బీజేపీతో తెగతెంపులు చేసుకుందామంటూ పార్టీ సమన్వయ కమిటీ మీటింగ్ లో ఏకంగా చంద్రబాబుకే టీడీపీ నేతలు సూచించారు. గుంటూరు జిల్లాలోని ఎన్టీఆర్ స్టేడియం వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ చర్చనీయాంశమైంది. బీజేపీతో టీడీపీ పొత్తు..ఇంటికి రాదు విత్తు ..మన గింజలు కూడా మనకు దక్కవు అన్న నినాదంతో రాసిన ఫ్లెక్సీని పెట్టారు. టీడీపీ అభిమానుల పేరుతో వెలసిన ఫ్లెక్సీని గుంటూరు వాసులు ఆసక్తిగా తిలకిస్తున్నారు.
లైవ్ టీవి
అయోధ్య కేసు రివ్యూ పిటిషన్లపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం
12 Dec 2019 11:21 AM GMTగొల్లపూడి మృతిపై సీఎం జగన్ దిగ్భ్రాంతి
12 Dec 2019 11:16 AM GMTబాహుబలి ఆడింది.. సైరా ఆడలేదు.. ఎందుకంటే?
12 Dec 2019 11:15 AM GMTఆదివారం గొల్లపూడి అంత్యక్రియలు
12 Dec 2019 10:56 AM GMT'తెలుగు కథకు వందేళ్ల వందనాలు' వందనంగా అందించిన గొల్లపూడి!
12 Dec 2019 9:31 AM GMT