Top
logo

కరీంనగర్‌లో టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య ఫ్లెక్సీల రగడ

కరీంనగర్‌లో టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య ఫ్లెక్సీల రగడ
X
Highlights

కరీంనగర్‌లో రాజకీయాలు వేడెక్కాయి. కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా ఎన్నికైన తర్వాత తొలిసారిగా సొంత...

కరీంనగర్‌లో రాజకీయాలు వేడెక్కాయి. కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా ఎన్నికైన తర్వాత తొలిసారిగా సొంత నియోజకవర్గానికి వచ్చిన పొన్నం ప్రభాకర్‌ కోసం.. ఆ పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే అనుమతి లేదంటూ.. మున్సిపల్‌ అధికారులు వాటిని తొలగించారు. దీంతో కాంగ్రెస్‌ కార్యకర్తలు.. భగ్గుమన్నారు. ఎంపీ వినోద్‌ ఇంటిముందు ఆందోళనకు దిగారు. దీంతో అక్కడే ఉన్న టీఆర్ఎస్‌ నాయకులతో పాటు.. మున్సిపల్‌ సిబ్బంది తో వాగ్వాదానికి దిగారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. టీఆర్ఎస్ నేతల ఫ్లెక్సీలు తీయకుండా కేవలం తమ పార్టీ నేతల ఫ్లెక్సీలు తొలగించడం ఏంటని కాంగ్రెస్ నేతలు ప్రశ్నించారు. మరోవైపు ఈటెల రాజేందర్‌, ఎంపీ వినోద్ సమక్షంలో కొందరు కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్‌లో చేరుతున్నారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. మున్సిపల్ సిబ్బంది టీఆర్ఎస్ ఫ్లెక్సీలను తొలగించకుండా కేవలం కాంగ్రెస్ ఫ్లెక్సీలను తొలగించడంతో వివాదం మొదలైంది. మున్సిపల్ సిబ్బందితో కాంగ్రెస్ నేతలు వాగ్వాదానికి దిగారు. టీఆర్ఎస్ ఫ్లెక్సీలను కూడా తొలగించాలని లేదంటే తామే స్వయంగా వాటిని తొలగిస్తామని హెచ్చరించారు.

Next Story