Top
logo

ఇరిగేషన్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఐదేళ్ల నేహాల్‌

ఇరిగేషన్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఐదేళ్ల నేహాల్‌
X
Highlights

మీకు తెలిసిన యు.కే.జి చదివే పిల్లలు ఖాళీ సమయాల్లో ఏం చేస్తారంటే ఆడుకోవడమో లేక టివి చూస్తాడని అంటారు. కానీ,...

మీకు తెలిసిన యు.కే.జి చదివే పిల్లలు ఖాళీ సమయాల్లో ఏం చేస్తారంటే ఆడుకోవడమో లేక టివి చూస్తాడని అంటారు. కానీ, ఖమ్మం జిల్లా చింతకాని మండలం పండిళ్లపల్లికి చెందిన కోటి నెహల్ అనే బాల మేధావి తన జ్ఞాపక శక్తితో తెలంగాణ ప్రభుత్వాన్నే మెప్పించాడు. సీఎం కేసీఆర్‌ రీ డిజైన్‌ చేసిన ప్రాజెక్టుల తీరును అనర్గళంగా చెప్పి మంత్రి హరీశ్‌రావు మనసు చూరగొన్నాడు. దీంతో కోటి నెహాల్‌ను తెలంగాణా ఇరిగేషన్‌ శాఖ బ్రాండ్‌ అంబాసిడార్‌గా నియమించారు.

అయిదేళ్ల ఈ నెహల్ ఇప్పటే అనేక అవార్డులు పొందాడు. రీ డిజైన్‌ ద్వారా కృష్ణా, గోదావరి నదీ జలాలను తెలంగాణాకి ఎలా తీసుకొని రావాలో సీఎం కేసీఆర్‌కి, హరీశ్‌రావు, ఇరిగేషన్‌ శాఖ ఇంజనీర్లకే తెలుసు. అలాంటిది అయిదేళ్లున్న కోటి నెహాల్‌ ఏక బిగిన ఇరవై నిమిషాల పాటు తెలంగాణా ప్రాజెక్టులపై మాట్లాడాడు. అయిదేళ్ల నెహాల్‌ ప్రజ్ఞాపాటవాలు చూసి ఇరిగేషన్‌ మంత్రి హరీశ్‌రావు, పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఛైర్మన్‌ గంటా చక్రపాణి సైతం ముచ్చట పడ్డారు.

అయిదేళ్ల కోటి నెహాల్‌ను పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఛైర్మన్‌ గంటా చక్రపాణి అభినందించారు. నెహాల్‌కు రియల్‌ ప్రాజెక్టు పనులు చూపించాలని ఇరిగేషన్‌ అధికారులను కోరారు. కోటి నెహాల్‌ని ఇరిగేషన్‌ మంత్రి హరీశ్‌రావు అభినందించారు. నెహాల్‌ విద్యాభ్యాసాన్ని ఇరిగేషన్‌ శాఖ తీసుకుంటుందని ప్రకటించారు. కాలేశ్వరం ప్రాజెక్టు మొత్తాన్ని మూడు రోజుల పాటు నెహాల్‌ ఫ్యామిలీకి చూపించాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణ ఇరిగేషన్‌ శాఖ బ్రాండ్‌ అంబాసిడార్‌గా కోటి నెహాల్‌ని నియమిస్తున్నట్లు ప్రకటించారు.

ఖమ్మంజిల్లా పందిళ్లపల్లి గ్రామానికి చెందిన కోటి హనుమంతరావు, రజినీల కుమారుడు నెహాల్ అతిచిన్న వయసులోనే అరవై దేశాలను, వాటి స్థానాలను, ఆయా దేశాల జాతీయ పతాకాలను క్షణంలో చెప్పేవాడు. తెలంగాణా బ్రాండ్‌ అంబాసిడార్‌గా తమ అబ్బాయిని నియమించడంపై తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Next Story