logo
జాతీయం

జమ్మూ కాశ్మీర్‌ లో ఎన్ కౌంటర్.. ఐదుగురు ఉగ్రవాదుల హతం

జమ్మూ కాశ్మీర్‌ లో ఎన్ కౌంటర్.. ఐదుగురు ఉగ్రవాదుల హతం
X
Highlights

జమ్మూ కాశ్మీర్‌ కుల్గామ్‌లో ముష్కర వేట కొనసాగుతోంది. కజిగూండ్‌లోని చౌగమ్ ప్రాంతంలో ఉగ్రవాదులు తలదాచుకున్నారన్న ...

జమ్మూ కాశ్మీర్‌ కుల్గామ్‌లో ముష్కర వేట కొనసాగుతోంది. కజిగూండ్‌లోని చౌగమ్ ప్రాంతంలో ఉగ్రవాదులు తలదాచుకున్నారన్న సమాచారంతో పోలీసులు సెర్చ్‌ నిర్వహించారు.ఈ క్రమంలో తీవ్రవాదులు కాల్పులు జరిపారు. భద్రతా దళం కూడా వారిపై ఎదురు కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో మొదట ముగ్గురు తీవ్రవాదులు హతమవ్వగా. తరువాత మరో ఇద్దరి కోసం జల్లెడ పట్టి వారిని కూడా గుర్తించి హతమార్చారు. ఎన్‌కౌంటర్‌ కారణంగా బారాముల్లా, క్వాజీగండ్‌, మధ్య రైళ్ల రాకపోకలను నిలిచిపోయాయి. భద్రతా దళాలు నిరంతరం అప్రమత్తంగా ఉన్నప్పటికీ ఉగ్రమూకలు రెచ్చిపోతున్నారు. దీంతో అధికారులు గాలింపును ముమ్మరం చేశారు.

Next Story