మీకు తెలుసా..? మనదేశంలో తొలి ఓటు వేసింది ఈయనే..

మీకు తెలుసా..? మనదేశంలో తొలి ఓటు వేసింది ఈయనే..
x
Highlights

బ్రిటిష్ వారి పాలన పోయి దేశానికీ స్వాతంత్ర వచ్చిన తరువాత తొలిసారిగా భారత దేశానికీ లోక్‌సభ ఎన్నికలు 1951-52 కాలంలో జరిగాయి. దేశంలోని ఇతర రాష్ట్రాల...

బ్రిటిష్ వారి పాలన పోయి దేశానికీ స్వాతంత్ర వచ్చిన తరువాత తొలిసారిగా భారత దేశానికీ లోక్‌సభ ఎన్నికలు 1951-52 కాలంలో జరిగాయి. దేశంలోని ఇతర రాష్ట్రాల కంటే 5 నెలల ముందే హిమాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికలు జరిగాయి. మంచు ప్రభావిత ప్రాంతం కావడం, ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉండటంతో ముందస్తుగా అక్కడ పోలింగ్ జరిగింది. అప్పట్లో తొలి ఓటువేసిన పౌరుడి పేరు శ్యామ్‌ శరణ్‌ నేగి. హిమాచల్‌ ప్రదేశ్‌లోని కల్ప జిల్లాకు చెందిన నేగి 1917 జూలై 1న జన్మించారు. దాంతో 1952 లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో శ్యామ్‌ శరణ్‌ నేగి దేశంలోనే తొలి ఓటరుగా చోటు దక్కించుకుని, శాశ్వతంగా గుర్తుండిపోయాడు.ఈ క్రమంలో 2010లో జరిగిన ఎన్నికల సంఘం వజ్రోత్సవాల సందర్భంగా శ్యామ్‌శరణ్‌ నేగిని
గుర్తుచేశారు కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌ నవీన్‌ చావ్లా. ఆ సమయంలో ఒక బృందం నేగి పుట్టిన గ్రామాన్ని కూడా సందర్శించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories