logo
సినిమా

దర్శకుడిగా మారనున్న యువ హీరో

దర్శకుడిగా మారనున్న యువ హీరో
X
Highlights

తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న విశ్వక్ సేన్ ఇప్పుడు దర్శకుడిగా మన ముందుకు రాబోతున్నాడు. 'వెళ్ళిపోమాకే'...

తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న విశ్వక్ సేన్ ఇప్పుడు దర్శకుడిగా మన ముందుకు రాబోతున్నాడు. 'వెళ్ళిపోమాకే' సినిమాతో హీరోగా పరిచయమైన విశ్వక్ సేన్ ఈ మధ్యనే తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో 'ఈ నగరానికి ఏమైంది' అనే సినిమాలో కనిపించాడు. ఇప్పుడు దర్శకుడిగా మారనున్నాడు. 'ఫలక్ నుమా దాస్' అనే సినిమాతో దర్శకుడిగా పరిచయంకానున్నాడు విశ్వక్. ఈ సినిమా మలయాళం సూపర్ హిట్ సినిమా అయిన 'అంగమలీ డైరీస్' సినిమాకు రీమేక్ గా తెరకెక్కనుంది.

ఈ సినిమాకు విశ్వక్ సేన్ దర్శకుడు మాత్రమే కాదు హీరో కూడా. క్రిస్మస్ సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు దర్శక నిర్మాతలు. కళ్ళజోడు పెట్టుకుని విశ్వక్ సేన్ ఈ సినిమాలో చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. వన్మయి క్రియేషన్స్ బ్యానర్ పై కరాటే రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. క్రైమ్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాలో సలోని మిశ్రా, హర్షిత మరి కొందరు ముఖ్య పాత్రలు పోషించనున్నారు. మరి దర్శకుడుగా విశ్వక్ సేన్ ప్రేక్షకులను ఎంతవరకూ మెప్పిస్తాడో వేచి చూడాలి.

Falaknumadas First Look

Next Story