Top
logo

శంషాబాద్ విమానాశ్రయం‌లో తృటిలో పెను ప్రమాదం

శంషాబాద్ విమానాశ్రయం‌లో తృటిలో పెను ప్రమాదం
X
Highlights

శంషాబాద్ విమానాశ్రయం‌లో 149 మంది ప్రయాణీకులకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. తెల్లవారుజామున కువైట్‌ నుంచి...

శంషాబాద్ విమానాశ్రయం‌లో 149 మంది ప్రయాణీకులకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. తెల్లవారుజామున కువైట్‌ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన జజీరా J9608 విమానం లో అగ్ని ప్రమాదం సంభవించింది. విమానం రన్‌ వేపై దిగుతున్న సందర్భంలో కుడి వైపున ఉన్న ఇంజన్‌ నుంచి మంటలు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన పైలట్‌ విమానాన్ని వెంటనే నిలిపేశారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న ఫైర్‌ సిబ్బంది మంటలను ఆర్పేశారు. ప్రయాణికులు సురక్షితంగానే ఉన్నట్టు సమాచారం.

Next Story