తూర్పుగోదావరి జిల్లాలో భారీ అగ్నిప్రమాదం

తూర్పుగోదావరి జిల్లాలో భారీ అగ్నిప్రమాదం
x
Highlights

తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలం పాశర్లపూడి జాతీయ రహదారి దగ్గర జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో 10 షాపులు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఒక్కసారిగా ఎగసిపడిన...

తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలం పాశర్లపూడి జాతీయ రహదారి దగ్గర జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో 10 షాపులు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఒక్కసారిగా ఎగసిపడిన మంటలకు ఆ ప్రాంతంలో ఉన్న షాపులన్నింటికి వ్యాపించాయి. ఏం జరుగుతుందో తెలిసే లోపే, మంటలు అక్కడున్న షాపులను చూట్టేశాయి. దీంతో పది షాపులు అగ్నికి ఆహుతయ్యాయి. భారీగా ఎగసిపడని మంటలను చూసి స్థానికులు ఆందోళనతో పరుగులు తీశారు. స్థానికంగా ఉన్న మిఠాయి షాపులో పొయ్యి నుంచి నిప్పురవ్వలు ఎగసిపడటంతో.. ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ఒక్కసారిగా మంటలు చెలరేగి షాపులు, అగ్నికి అహుతయ్యాయని స్థానికులు చెబుతున్నారు. రాజోలు పైర్ ఇంజిన్ తో పాటు ఓఎన్జీసీకి చెందిన ఫైర్ ఇంజన్లు వచ్చి మంటలను అదుపు చేశాయి. ఈ ప్రమాదంలో సుమారు 30లక్షల మేర ఆస్థి నష్టం జరిగిందని బాధితులు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories