తెలంగాణ బీజేపీ, కాంగ్రెస్ నేతల గుజరాత్ ఎన్నికల జపం

Highlights

బీజేపీ, కాంగ్రెస్ ఈ రెండు జాతీయ పార్టీలు గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలపై గంపెడు ఆశలు పెట్టుకున్నాయి. ఈ ఎన్నికల ఫలితంపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. గుజరాత్...

బీజేపీ, కాంగ్రెస్ ఈ రెండు జాతీయ పార్టీలు గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలపై గంపెడు ఆశలు పెట్టుకున్నాయి. ఈ ఎన్నికల ఫలితంపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. గుజరాత్ ఫలితం తెలంగాణలో తమ జాతకం మారుస్తుందని ముసిరిపోతున్నాయి. గుజరాత్ ఎలక్షన్ కు, తెలంగాణకు ఉన్న లింక్ ఏమిటో చూడండి.

తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీలు గుజరాత్ ఎన్నికల జపం చేస్తున్నాయి. బీజేపీ మరోసారి గెలిస్తే తెలంగాణలో బీజేపీకి మంచి రోజులు వస్తాయని కమలనాథులు కలలుకంటుంటే, కాంగ్రెస్ విజయం సాధిస్తే దేశవ్యాప్తంగా మోడీ హవా తగ్గడంతో పాటు తెలంగాణలో మళ్లీ మహార్దశ వస్తుందని హస్తం నేతలు ఆశతో ఉన్నారు.

గుజరాత్ ఎన్నికల్లో గెలిస్తే సార్వత్రిక ఎన్నికల కోసం మధ్యంతర లోక్ సభ ఎన్నికలకు బీజేపీ వెళుతుందన్న ప్రచారం ఉంది. ఇదే నిజమైతే 2018 లో ఎలక్షన్ జరిగే ఛాన్స్ ఉంది. లేకపోతే యధావిధిగా 2019లో ఎన్నికలు జరుగుతాయి. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే మోడీ హవా మరింత పెరిగి తెలంగాణలో కలిసి వస్తుందని లక్ష్మణ్ అండ్ టీమ్ భావిస్తోంది. ఈ ఎన్నికల తర్వాత దక్షిణాదిలో కర్నాటక, తెలంగాణలపై బీజేపీ అగ్ర నాయకత్వం దృష్టి సారించనుంది.

తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ సైతం గుజరాత్ ఎన్నికలపై కన్నేసింది. నాలుగు పర్యాయాలు గెలిచిన బీజేపీ ఈ సారి నెగటివ్ ఓటింగ్ తో ఓడిపోతుందని ఆశలు పెట్టుకుంది. బీజేపీ పరాజయంపాలైతే మోడీ కరిష్మా తగ్గి కాంగ్రెస్ కు మంచి రోజులు వస్తాయని భావిస్తోంది. తెలంగాణలో బీజేపీ, టీఆర్ఎస్ అసంతృప్తి నేతలు కాంగ్రెస్ గూటికి చేరుతారని ఆశాభావంతో ఉంది. దీంతో టీఆర్ఎస్ కు మరింత గట్టిగా టక్కర్ ఇవ్వొచ్చని కాంగ్రెస్ నాయకులు ధీమాగా ఉన్నారు. గుజరాత్ ఎన్నికల ఫలితాలను బట్టి వ్యూహాలకు పదునుపెట్టాలని కాంగ్రెస్, బీజేపీ నాయకులు చూస్తున్నారు. మరి, ఆ రాష్ట్ర ఎన్నికల ఫలితం ఎలా ఉంటుందో ఎదురుచూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories