logo
సినిమా

ర‌కుల్ కి పండ‌గ‌లే

ర‌కుల్ కి పండ‌గ‌లే
X
Highlights

తెలుగు తెర‌ని ఏలుతున్న‌ యువ క‌థానాయిక‌ల్లో ర‌కుల్ ప్రీత్ సింగ్ ఒక‌రు. ప‌వ‌న్ క‌ల్యాణ్, ప్ర‌భాస్‌ని...

తెలుగు తెర‌ని ఏలుతున్న‌ యువ క‌థానాయిక‌ల్లో ర‌కుల్ ప్రీత్ సింగ్ ఒక‌రు. ప‌వ‌న్ క‌ల్యాణ్, ప్ర‌భాస్‌ని మిన‌హాయిస్తే ఇప్ప‌టి అగ్ర క‌థానాయ‌కులంద‌రి సినిమాల్లోనూ న‌టించేసిందీ ముద్దుగుమ్మ‌. అంతేకాకుండా.. ఈ ఏడాదిలో వ‌చ్చిన 'రారండోయ్ వేడుక చూద్దాం'లో భ్ర‌మ‌రాంబ‌గా, 'జ‌య‌జాన‌కి నాయ‌క'లో జాన‌కి (స్వీటీ)గా క‌నిపించి త‌న‌లోని న‌టిని కొత్త కోణాల్లో ఆవిష్క‌రించింది ర‌కుల్‌. ఇదిలా ఉంటే.. ర‌కుల్ న‌టిస్తున్న తాజా చిత్రాలు పండ‌గ‌ల సంద‌ర్భంలో విడుద‌ల‌కు ముస్తాబ‌వుతున్నాయి. మ‌హేష్‌బాబుతో తొలిసారిగా ఆమె న‌టించిన 'స్పైడ‌ర్' చిత్రం విజ‌య‌ద‌శ‌మి కానుక‌గా ఈ నెల 27న విడుద‌ల కాబోతుంది. అలాగే కార్తీతో క‌లిసి న‌టించిన త‌మిళ చిత్రం 'తీర‌న్ అధిగారం ఒండ్రు' (తెలుగులో 'ఖాకీ') దీపావ‌ళికి ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. అంటే ర‌కుల్ కొత్త సినిమాల‌కి పండ‌గ‌లే లక్ష్యంగా నిలిచాయ‌న్న‌మాట‌. ఈ రెండు సినిమాల‌పై భారీ ఆశ‌ల‌నే పెట్టుకుంది ర‌కుల్‌.

Next Story