ముగిసిన సీనియర్ల శకం...ఆ లోటును భర్తీ చేసేదెవరు?

x
Highlights

ఇన్నాళ్లూ ఆయన తమిళనాడుకు పెద్ద దిక్కుగా ఉండేవారు. అనారోగ్యంతో ఇంటికే పరిమితమైనా తమిళనాడు ప్రజలు ఎంతో భరోసాతో బతికారు క్రియాశీలక రాజకీయాల్లో...

ఇన్నాళ్లూ ఆయన తమిళనాడుకు పెద్ద దిక్కుగా ఉండేవారు. అనారోగ్యంతో ఇంటికే పరిమితమైనా తమిళనాడు ప్రజలు ఎంతో భరోసాతో బతికారు క్రియాశీలక రాజకీయాల్లో కరుణానిధి లేకపోయినా, తమిళనాడు ప్రజలు ఒక రకమైన ధైర్యాన్ని పొందారు కానీ ఇప్పుడు తమిళనాడులో రాజకీయ శూన్యత కనిపిస్తోంది. ప్రజలకు దారి చూపి నడిపించే నేత కరువయ్యాడా?

తలైవార్ కరుణానిధి అస్తమయంతో తమిళనాడులో ఒక శకం ముగిసినట్లయింది. తమిళనాడుకు దశను, దిశను నిర్దేశించే తరం దాదాపు వెళ్లిపోయింది. ఎంజీఆర్, జయలలిత, కరుణానిధి. ఈ ముగ్గురికీ తమిళ ప్రజలతో ఉన్న సంబంధం ఇంతా అంతా కాదు.. దాదాపు తమిళ జాతిని ముందుకు నడిపిన దూతలు ఇప్పుడు కరుణానిధి కూడా మరణించడంతో తమిళ రాజకీయాలు ఎటువైపు తిరుగుతాయన్నది పెద్ద ప్రశ్నగా మారింది. కరుణానిధి వారసుడుగా ఉన్న స్టాలిన్ పార్టీని, తమిళనాడును ఎలా ముందుకు నడుపుతారన్న ది చర్చనీయాంశంగా మారింది. దశాబ్దాల తరబడి ప్రాంతీయ పార్టీలే తమిళనాడును శాసించాయి. అయితే డిఎంకే, లేదంటే అన్నా డిఎంకే ఈ రెండు పార్టీలకే తప్ప తమిళ ప్రజలు జాతీయ పార్టీలను ఆదరించినది లేదు ఏ జాతీయ పార్టీ అయినా ప్రాంతీయపార్టీ ఊతం లేనిదే ఆ రాష్ట్రంలో అడుగు పెట్టలేదు. అలాంటి పరిస్థితుల్లో జయలలిత అకాల మరణంతో అన్నాడిఎంకే పార్టీ ఓ పెద్ద దిక్కంటూ లేకుండా అయిపోయింది. ఆలోచించి నిర్ణయాలు తీసుకునే నేతలే ఆ పార్టీలో లేరు జయ తన వారసులుగా ఎవరినీ ప్రకటించకపోవడంతో అన్నాడిఎంకే పార్టీ లో అంతర్గత కలహాలు చాపకింద నీరులా విస్తరిస్తూనే ఉన్నాయి. పళని, పన్నీర్ కలసి నట్లే కనిపిస్తున్నా అసలు విషయం వచ్చే సరికి ఇద్దరి తీరు ఎవరికి వారే యమునా తీరే అన్న చందానే ఉంటోంది. మరోవైపు శశికళ వర్గానికి చెందిన దినకరన్ పైకి కనపడకపోయినా తనకంటూ ఓవర్గాన్ని నిర్మించుకుంటున్నారు.తమిళ రాజకీయాలపై కన్నేసిన బిజెపి తమిళనాడులో కాలు మోపడానికి శత విధాల ప్రయత్నించింది. జయ ఆస్పత్రిలో ఉన్నప్పుడే బిజెపి పెద్దలు అన్నాడిఎంకే రాజకీయాల్లో వేలు పెట్టారని నేతలను దారికి తెచ్చుకునే ప్రయత్నం చేశారనీ వార్తలున్నాయి. మరోవైపు ప్రతిపక్షంలో ఉన్న కరుణానిధి అనారోగ్యంతో ఇంటికే పరిమితమవడంతో పార్టీ బాధ్యతలను స్టాలిన్ చూస్తున్నార. తండ్రి అంత పూర్తి స్థాయి సమర్ధత లేకపోయినా స్టాలిన్ కూడా తమిళ రాజకీయాలనుబాగా అవుపోసన పట్టిన వ్యక్తే కానీ సంక్షోభ సమయాల్లో పార్టీని ఎలా నడుపుతారన్నది చూడాలి. కరుణానిధి సూచనతో పెద్ద కొడుకు అళగిరి వెనక్కు తగ్గినా, పార్టీ నాయకత్వ బాధ్యతలు కావాలంటూ మళ్లీ గళమెత్తితే ఆ సంక్షోభాన్ని ఎదుర్కొనడం స్టాలిన్ కు పెద్ద సవాలే డిఎంకే, అన్నా డిఎంకే పార్టీలు రెండూ అగ్ర నేతలను కోల్పోయి అనాధగా మారిపోయాయి.

మరోవైపు సినీ తారలు రజనీకాంత్, కమల్ హాసన్ కూడా కొత్త పార్టీలతో ముందుకొస్తున్నారు వీరిద్దరికీ చరిష్మా పుష్కలంగా ఉన్నా రాజకీయ అనుభవం శూన్యం కమల్ మక్కల్ నీది మయ్యుం పార్టీతో ఇప్పటికే ప్రజల ముందుకొచ్చినా పార్టీ నిర్మాణంపై ఇంకా శ్రద్ధ పెట్టలేదు ఇక వస్తా వస్తా అంటున్న రజనీకాంత్ ఇప్పటి దాకా పార్టీయే పెట్టలేదు ఈపరిస్థితుల్లో ఈ ఇద్దరూ కొత్త పార్టీలు పెట్టినా, జనం వారిని ఆదరించడానికి చాలా సమయం పడుతుంది. తమిళనాడులో రాజకీయ వాతావరణం భిన్నం అక్కడ కులాలు, మతాలు, తెగలు, ప్రాంతాలు, వర్గాలు చాలా చాలా ఎక్కువ పైగా తమిళ రాజకీయాలన్నీ ఉద్వేగంతో కూడుకున్నవే ఇలాంటి సమయంలో 2019 ఎన్నికలు వస్తున్నాయి. అటు కాంగ్రెస్, ఇటు బిజెపి కూడా తమిళనాడులో అగ్రనాయకత్వం లేని సమయాన్ని తమకు అనుకూలంగా మలచుకునేందుకు ప్రయత్నించడం ఖాయం పార్టీలతో పొత్తులు, ఎత్తులు నిర్ణయించడంలో స్టాలిన్ సత్తా బయటపడుతుంది. అదే సమయంలో నివురు గప్పిన నిప్పులా ఉన్న అన్నా డిఎంకే లో వర్గ విభేదాలను ఏ పార్టీ తమకు అనుకూలంగా మలచుకుంటుందో చూడాలి.

ఇప్పటి వరకూ సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన నేతలే రాష్ట్రాన్ని ఏలారు ఆ కోణంలోంచి ఆలోచిస్తే రజనీ, కమల్ ఇద్దరూ ఆ స్థానాన్ని భర్తీ చేస్తారా? లేక ఇప్పటికే డిఎంకే పై పట్టు సంపాదించిన స్టాలిన్ తిరుగులేని నేతగా ఎదిగి పగ్గాలు సాధించుకుంటారా అన్నది కాలమే నిర్ణయించాలి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories