చంద్రిక హత్య కేసులో కొత్త కోణం.. ప్రియుడు..

చంద్రిక హత్య కేసులో కొత్త కోణం.. ప్రియుడు..
x
Highlights

ప్రియుడితో రహస్యంగా ఫోనులో మాట్లాడుతోందనే అనుమానంతో చంద్రిక అనే యువతిని ఆమె తండ్రి కర్రతో కొట్టి చంపిన ఘటనలో కొత్తకోణం వెలుగులోకి వచ్చింది. శుక్రవారం...

ప్రియుడితో రహస్యంగా ఫోనులో మాట్లాడుతోందనే అనుమానంతో చంద్రిక అనే యువతిని ఆమె తండ్రి కర్రతో కొట్టి చంపిన ఘటనలో కొత్తకోణం వెలుగులోకి వచ్చింది. శుక్రవారం చంద్రిక తల్లిదండ్రుల మధ్య గొడవలో జరిగిన పొరపాటు కారణంగా చంద్రికను తండ్రి హత్య చేసినట్టు భావిస్తున్నారు. మరోవైపు ఆమె ఫోన్‌లో మాట్లాడిన యువకుడిని పోలీసులు ప్రశ్నించగా తమ ఇద్దరి మధ్య ప్రేమ ఉన్నట్లు అంగీకరించాడు. తమ ప్రేమ విషయాన్ని చంద్రిక ఇంట్లో చెప్పడంతోనే ఈ దారుణం జరిగిందని వెల్లడించాడు. కాగా కృష్ణాజిల్లా చందర్లపాడు మండలంలో కోటయ్య కుమార్తె చంద్రిక(24) ఇటీవల బీఫార్మసీ పూర్తిచేసి ఎంఫార్మసీ లో చేరారు. కాలేజీ మొదలు కావడానికి కొద్దిరోజుల సమయం ఉండటంతో ఆమె ఇంటివద్దే ఉంది. ఈ క్రమంలో శనివారం ఎవరితోనో ఫోన్ మాట్లాడుతుందని తండ్రి కోటయ్య అరిచాడు. తాను స్నేహితులతో మాట్లాడుతున్నాని చెప్పింది. ఈ క్రమంలో తండ్రికూతుళ్ళ మధ్య గొడవ జరిగింది. అది కాస్త పెనుకోపానికి దారితీసి.. కూతురిపై కన్నెర్ర చేసిన కోటయ్య ఆమెను విచక్షణా రహితంగా గొడ్డలికర్రతో దాడి చేసి హతమార్చాడు. తాను ఎంతచెప్పినా వినడం లేదంటూ ఆమె ప్రాణాలు తీశాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తులో భాగంగా ఆమెతో కలిసి చదువుకున్న స్నేహితులను కూడా విచారిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories