logo
జాతీయం

ఢిల్లీలో కదం తొక్కిన అన్నదాతలు

ఢిల్లీలో కదం తొక్కిన అన్నదాతలు
X
Highlights

గిట్టుబాటు ధర, ఫంట రుణమాఫీ డిమాండ్‌తో ఢిల్లీలో నిన్నటి నుంచి ఆందోళన చేస్తున్న అన్నదాతలు ఇవాళ కదం తొక్కారు....

గిట్టుబాటు ధర, ఫంట రుణమాఫీ డిమాండ్‌తో ఢిల్లీలో నిన్నటి నుంచి ఆందోళన చేస్తున్న అన్నదాతలు ఇవాళ కదం తొక్కారు. వామపక్షాల మద్దతుతో 207 రైతు, రైతుకూలీ సంఘాలతో కూడిన అఖిల భారత రైతు సంఘర్షణ సమన్వయ సమితి పార్లమెంటకు భారీ ర్యాలీ నిర్వహిస్తోంది. రైతులు రాం లీలా మైదానం దగ్గర భారీ ప్రదర్శన నిర్వహిస్తున్నారు. రైతుల ఛలో పార్లమెంట్ నేపథ్యంలో ఢిల్లీలో భారీగా పోలీసులను మోహరించారు.

పలు డిమాండ్లతో దేశ రాజధానిలో అన్నదాతలు రెండ్రోజుల ఆందోళనకు పిలుపునిచ్చారు. పంటల కనీస మద్దతు ధర అధికారం రైతుల చేతుల్లోనే ఉంచాలనీ 2018 రబీ వరకు పంట రుణాల్ని పూర్తిగా సంపూర్ణంగా మాఫీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే రైతుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా 21 రోజులపాటు పార్లమెంటు సమావేశాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ఇక స్వామినాథన్‌ కమిటీ సిఫార్సులు అమలు చేయాలనీ ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు 10 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని అన్నదాతలు డిమాండ్ చేస్తున్నారు. 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేయాలనీ బీమా రాయితీ కల్పించాలని రైతులు కోరుతున్నారు.

Next Story