Top
logo

రైతుల కలలు నిజం చేస్తున్నాం : కేసీఆర్

రైతుల కలలు నిజం చేస్తున్నాం : కేసీఆర్
X
Highlights

సమైక్య పాలనలో తెలంగాణ అణచివేతకు గురైందన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌. సొంత రాష్ట్రం సిద్ధించిన తర్వాత...

సమైక్య పాలనలో తెలంగాణ అణచివేతకు గురైందన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌. సొంత రాష్ట్రం సిద్ధించిన తర్వాత ఎన్నో అడ్డంకులను అధిగమించి....ఏ రాష్ట్రమూ అమలు చేయని సంక్షేమ పథకాలు చేశామని స్పష్టం చేశారు. ఆడపిల్ల పెళ్లికి లక్షా 116 రూపాయలు ఇస్తున్నామన్న ఆయన...దశల వారీగా ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు.

పెద్ద ఎత్తున గోదాములు నిర్మించామన్న సీఎం కేసీఆర్‌...సకాలంలో రైతులకు అవసరమైన ఎరువులు పంపిణీ చేస్తున్నామని చెప్పారు. రైతులు కన్న కలలు నిజం చేస్తూ...వ్యవసాయ రంగంలో సరికొత్త ఉత్తేజాన్ని నింపామన్నారు. రాష్ట్రంలో కోటి ఎకరాలకు నీళ్లు అందించడమే లక్ష్యంగా....ప్రాజెక్టులను నిర్మిస్తున్నామని చెప్పారు. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తూనే....కొత్త ప్రాజెక్టు పనులు చేస్తున్నామన్నారు. మిషన్ కాకతీయ పథకం సత్ఫలితాలిచ్చిందన్న కేసీఆర్‌....రాష్ట్రవ్యాప్తంగా సాగు విస్తీర్ణం పెరిగిందన్నారు.

రైతులు పంటలు పెట్టుకోవడానికి...రైతు బంధు పథకాన్ని ప్రవేశపెట్టామన్నారు సీఎం కేసీఆర్‌. రైతు బంధు పథకంతో గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొందన్న ఆయన...ఎల్‌ఐసీ ద్వారా రైతులకు బీమా పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు. రైతు బీమా ప్రీమియం డబ్బును ప్రభుత్వమే భరిస్తుందని కేసీఆర్‌ తెలిపారు.

Next Story