విద్యుత్ షాక్ తో రైతు మృతి!

విద్యుత్ షాక్ తో రైతు మృతి!
x
Highlights

ప్రమాదవ శాత్తు కరెంటు షాక్ కొట్టి రైతు మృతి చెందిన సంఘటన నిర్మల్ జిల్లాలోని లక్ష్మణచందా మండల కేంద్రంలో జరిగింది. గ్రామానికి చెందిన సాంబయ్య(60) నీరు...

ప్రమాదవ శాత్తు కరెంటు షాక్ కొట్టి రైతు మృతి చెందిన సంఘటన నిర్మల్ జిల్లాలోని లక్ష్మణచందా మండల కేంద్రంలో జరిగింది. గ్రామానికి చెందిన సాంబయ్య(60) నీరు పెట్టేందుకు పొలానికి వెళ్ళాడు. అయితే కరెంట్ రాని కారణంగా మోటార్ ఆడలేదు అంతకుందు ట్రాన్స్‌ఫార్మర్ వద్ద తీగలు ఊడిపడ్డాయి. అయితే హెల్పర్ కు ఫోన్ చేస్తే ఆలస్యం అవుతుందనే కారణంతో తానే సరిచేయాలని ట్రాన్స్‌ఫార్మర్ పైకి ఎక్కాడు. దీంతో ప్రమాదవ శాత్తు కరెంట్ షాక్ కొట్టడంతో రైతు సాంబయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు.. సాంబయ్య మృతిపట్ల గ్రామంలో సహరైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories