నీ ప్రాణాలు తీస్తేగాని నా కోపం చల్లారదు.. పందిపై పైథాన్ ప్రతాపం

నీ ప్రాణాలు తీస్తేగాని నా కోపం చల్లారదు.. పందిపై పైథాన్ ప్రతాపం
x
Highlights

అడవిలో క్రూరజంతువులకు సైతం పైథాన్ అంటే వణుకు.. అలాంటిది పందులను అవి వదులుతాయా.. జపాన్ లో అదే జరిగింది.. పచ్చిక బైళ్ళలో సంచరిస్తున్నఓ పందిని...

అడవిలో క్రూరజంతువులకు సైతం పైథాన్ అంటే వణుకు.. అలాంటిది పందులను అవి వదులుతాయా.. జపాన్ లో అదే జరిగింది.. పచ్చిక బైళ్ళలో సంచరిస్తున్నఓ పందిని చుట్టేసింది ఓ భారీ పైథాన్. స్థానికంగా ఉన్న పొలంలో పనిచేసుకుంటున్నారు ఇద్దరు రైతులు. ఈ క్రమంలో వారి పెంపుడు పందిని ఆ పరిసరాల్లో వదిలారు. కొద్దిసేపటికి ఎక్కడినుంచి వచ్చిందో మెల్లగా ఆ పంది వద్దకు ఓ భారీ పైథాన్ వచ్చింది. అంతే దాన్ని ఒక్కసారిగా చుట్టేసి ఎముకలు పిండి
అయ్యేంతగా నలిపేసింది.నొప్పికి తట్టుకోలేక ఆ పంది అరిచింది. ఆ అరుపు విన్న యజమానులు వెంటనే వచ్చి పైథాన్ ను విడిపించే ప్రయత్నం చేశారు. కానీ అది ఆ పందిని విడవకుండా అలాగే పట్టుకుని ప్రాణాలు తీస్తే గాని కోపం చల్లారదన్నట్టు బుసలు కొడుతోంది. కానీ ఎలాగోలా దానిభారీ నుంచి పందిని విడిపించారు. కొందరు వ్యక్తులు ఈ దృశ్యాన్నీ చూసి వీడియో తీశారు. అనంతరం ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్ గా మారింది.

Show Full Article
Print Article
Next Story
More Stories