అభిమాని మృతితో అనూహ్య నిర్ణయం తీసుకున్న లారెన్స్

తన అభిమాని అయిన శేఖర్ మరణంతో రాఘవ లారెన్స్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఇంతవరకూ ఇలాంటి నిర్ణయం సినీ...
తన అభిమాని అయిన శేఖర్ మరణంతో రాఘవ లారెన్స్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఇంతవరకూ ఇలాంటి నిర్ణయం సినీ ఇండస్ట్రీలో ఏ ప్రముఖుడూ తీసుకొని ఉండరు. అసలు విషయం ఏంటంటే..
ఆర్.శేఖర్ అనే లారెన్స్ అభిమాని ఆయనతో పిక్ తీసుకునేందుకు వెళ్లి చనిపోయాడు. ఇది లారెన్స్‌ను చాలా బాధించింది. దీంతో అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఇకపై తనకు టైమ్ దొరికినప్పుడల్లా అభిమానుల దగ్గరకు తానే వెళ్లి పిక్స్ తీసుకుని వస్తానని.. అభిమానులెవరూ తనకోసం రావద్దని స్పష్టం చేశారు.
ఈ మేరకు లారెన్స్ ఓ ట్వీట్ చేశారు. 'హాయ్ డియర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యాన్స్..! నాతో పిక్ తీసుకునేందుకు వస్తూ ఇటీవలే నా వీరాభిమాని శేఖర్ చనిపోయాడని మీకందరికీ ఇప్పటికే తెలిసి ఉంటుంది. అతని అంత్యక్రియలకు కూడా నేను వెళ్లాను. ఆ సంఘటన నన్ను తీవ్రంగా కలచివేసింది. దీంతో నేనొక నిర్ణయం తీసుకున్నాను. నాతో ఫోటోలు దిగేందుకు ఫ్యాన్స్ ఎవరు నా దగ్గరికి రావొద్దు. నాకు ఫ్రీ టైమ్ దొరికినప్పుడు నేనే నా అభిమానులు ఉండే ప్రాంతాలకు వచ్చి వారితో ఫోటోలు దిగుతాను. తొలిసారిగా ఈ నెల 7న సేలం నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాను. నేను మీకోసం వస్తున్నా. శేఖర్ ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుడిని వేడుకుంటున్నాను.’’ అని లారెన్స్ ట్వీట్ చేశారు. నటుడిగానే కాకుండా సామాజిక స్పృహ ఉన్న మంచి మనిషిగా ఎందరో మనసులు గెలుచుకున్న లారెన్స్ ఇప్పుడు తాను తీసుకున్న ఈ నిర్ణయంతో అభిమానుల మనసులలో చెరగని ముద్ర వేసుకున్నాడు.
Hi dear Friends and Fans..! I’m coming for you to Salem on 7th pic.twitter.com/xX56Al7lpS
— Raghava Lawrence (@offl_Lawrence) February 4, 2018
యుద్ధానికి సిద్ధం.. కాస్కో కేసీఆర్ అన్నట్లు సాగిన మోడీ ప్రసంగం
26 May 2022 11:30 AM GMTKodali Nani: పిల్లలను రెచ్చగొట్టి పవన్ పబ్బం గడుపుతున్నారు
26 May 2022 10:20 AM GMTGangula Kamalakar: బండి తన వాఖ్యలను వెనక్కి తీసుకోవాలి
26 May 2022 10:07 AM GMTCM KCR: మాజీ ప్రదాని దేవెగౌడ నివాసానికి సీఎం కేసీఆర్
26 May 2022 9:08 AM GMTటీజీ వెంకటేష్‌కు రాజ్యసభ? రెండు రాష్ట్రాల నుంచి ఇద్దరికి ఛాన్స్..
26 May 2022 8:56 AM GMTNarendra Modi: ఒక కుటుంబ పాలన కోసం తెలంగాణలో బలిదానాలు జరగలేదు
26 May 2022 8:44 AM GMTకోలి జాతి శునకంలా మారిన జపాన్ వ్యక్తి.. అందుకు రూ.12 లక్షల వ్యయం
26 May 2022 5:44 AM GMT
పాకిస్తాన్లో ఇక మీ ఆటలు సాగవ్... ఇమ్రాన్‌పై నిప్పులు చెరిగిన ప్రధాని...
27 May 2022 6:07 AM GMTకుక్కతో స్టేడియంలో వాకింగ్ చేసిన ఐఏఎస్ దంపతుల బదిలీ
27 May 2022 5:48 AM GMTతిరుపతికి ఏపీ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి
27 May 2022 5:22 AM GMTహైదరాబాద్ ఓల్డ్‌సిటీలో రియల్ దంగల్.. రెజ్లింగ్‌లో రాణిస్తున్న 14 ఏళ్ల...
27 May 2022 5:08 AM GMTరేవంత్ వ్యాఖ్యలపై టీ కాంగ్రెస్‌లో రచ్చ.. వివరణ ఇవ్వాలని మధుయాష్కీ...
27 May 2022 4:15 AM GMT