logo
జాతీయం

ఒకే కుటుంబంలో ఆరుగురు ఆత్మహత్య.. కారణం ఏంటంటే..

ఒకే కుటుంబంలో ఆరుగురు ఆత్మహత్య.. కారణం ఏంటంటే..
X
Highlights

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఢిల్లీ బురారీ ప్రాంతంలో ఒకే కుటుంబంలోని 11 మంది సామూహిక ఆత్మహత్యల ఉదంతం మరవకముందే...

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఢిల్లీ బురారీ ప్రాంతంలో ఒకే కుటుంబంలోని 11 మంది సామూహిక ఆత్మహత్యల ఉదంతం మరవకముందే ఇదే తరహా ఘటన మరోటి వెలుగుచూసింది. జార్ఖండ్‌లోని హజారిబాగ్ నగరంలో సామూహిక ఆత్మహత్య చేసుకున్నారు. వీరిలో ఐదు మంది ఉరివేసుకుని మరణించగా, మరొకరు బిల్డింగ్ మీదనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. అయితే వీరు ఫ్రూట్స్ బిజినెస్ లో భారీగా నష్టాలు రావడంతో అప్పులు కట్టలేక ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Next Story