అధికారుల నిర్వాకానికి ఓ కుటుంబం బలి

x
Highlights

మంచిర్యాల జిల్లాలో దారుణం జరిగింది. ప్రభుత్వ అధికారులు, సిబ్బంది నిర్వాకానికి ఓ కుటుంబం బలైపోయింది. లోన్ కోసం ఎంపీడీఓ కార్యాలయానికి వెళ్తే లంచం...

మంచిర్యాల జిల్లాలో దారుణం జరిగింది. ప్రభుత్వ అధికారులు, సిబ్బంది నిర్వాకానికి ఓ కుటుంబం బలైపోయింది. లోన్ కోసం ఎంపీడీఓ కార్యాలయానికి వెళ్తే లంచం ఇవ్వమని పీడించారు. 20 వేలు లంచం ఇస్తేనే లోన్ మంజూరు చేస్తామన్నారు. దీంతో వారికి లంచం ఇవ్వడానికి ఎన్నోచోట్ల ప్రయత్నించినా నిరుపేద కుటుంబం కావడంతో ఎక్కడా అప్పు పుట్టలేదు. ఓ వైపు కుటుంబ భారం, మరోవైపు లోన్ పొందలేని నిస్సహాయతతో మనస్తాపానికి గురైన ఓ ఫ్యామిలీ ఆత్మహత్యకు పాల్పడింది.

కాశిపేట మండలం చొప్పరిపల్లికి చెందిన తిరుపతి ఎస్సీ కార్పొరేషన్‌లో లోన్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. అతని లోన్ మంజూరు కావాలంటే 20వేలు లంచం ఇవ్వాలని ఎంపీడీఓ కార్యాలయంలో అధికారుల, సిబ్బంది డిమాండ్ చేశాడు. దీంతో 20వేల అప్పుకోసం అందరి వద్దకు తిరిగాడు. ఎక్కడా డబ్బులు అందకపోవడంతో మనస్తాపం చెందిన తిరుపతి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

భర్త మరణాన్ని తట్టుకోలేని తిరుపతి భార్య తమ ఇద్దరు పిల్లలకు నిద్రమాత్రలు వేసి, తానూ విషం తాగింది. దీంతో తిరుపతి భార్య మృతి చెందగా వారి ఇద్దరి పిల్లల పరిస్థితి విషమంగా మారింది. గమనించిన కుటుంబ సభ్యులు, స్థానికులు పిల్లలను ఆస్పత్రికి తరలించారు. దంపతుల ఆత్మహత్యకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు, బంధువులు డిమాండ్ చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories