ఫేస్‌బుక్‌ వ్యవహస్థాపక చైర్మెన్ జుకర్‌బర్గ్‌ ను తొలగించాలంటూ ప్రతిపాదన?

ఫేస్‌బుక్‌ వ్యవహస్థాపక చైర్మెన్ జుకర్‌బర్గ్‌ ను తొలగించాలంటూ ప్రతిపాదన?
x
Highlights

ఇటీవల ఫేస్‌బుక్‌లో చోటు చేసుకున్న డేటా హ్యాక్‌, ఫేక్‌ న్యూస్‌ ప్రకంపనలు, ఫేస్‌బుక్‌ వ్యవస్థాపకుడు మార్క్‌ జుకర్‌బర్గ్‌ పదవికే ఎసరు తెచ్చాయి. కంపెనీ...

ఇటీవల ఫేస్‌బుక్‌లో చోటు చేసుకున్న డేటా హ్యాక్‌, ఫేక్‌ న్యూస్‌ ప్రకంపనలు, ఫేస్‌బుక్‌ వ్యవస్థాపకుడు మార్క్‌ జుకర్‌బర్గ్‌ పదవికే ఎసరు తెచ్చాయి. కంపెనీ చైర్మన్‌గా జుకర్‌బర్గ్‌ను తొలగించాలని ఫేస్‌బుక్‌ ఇంక్‌లో మెజార్టీ షేర్లను కలిగి ఉన్న కంపెనీలు మార్క్‌ జుకర్‌బర్గ్‌ను చైర్మన్‌గా తొలగించాలనే ప్రతిపాదనను తీసుకొచ్చాయి. ఫేస్‌బుక్‌ వార్షిక సమావేశం 2019 మేలో జరగనున్న సందర్బంగా ఈ విషయంపై చర్చించాలని రోడ్‌ ఐలండ్‌ స్టేట్‌ ట్రెజర్స్‌ కోరుతోంది. అయితే ఈ విషయంపై స్పందించడానికి ఫేస్‌బుక్‌ అధికార ప్రతినిధి నిరాకరించారు. డేటా హ్యాక్‌, కేంబ్రిడ్జ్‌ అనలిటికా స్కాండల్‌ వంటి పలు సమస్యల నుంచి ఫేస్‌బుక్‌ను బయటపడేయడానికి ఇదే సరైన మార్గమని ఆ కంపీనీల ప్రతినిధులు భావిస్తున్నారు. ఇదిలావుంటే ఫేస్‌బుక్‌ షేర్లు 10 శాతంకు పడిపోయాయి.. పెన్సిల్వేనియా ట్రెజరీ 38,737, ఇల్లినోయిస్ ట్రెజరీ 1,90,712 , రోడ్‌ ఐలండ్‌ ట్రెజరీ 1,68,230 షేర్లను కలిగి ఉన్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories