ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌...స్వీట్‌ పాన్...ఔర్‌ ధోకా

ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌...స్వీట్‌ పాన్...ఔర్‌ ధోకా
x
Highlights

చేతిలో స్మార్ట్‌‌ఫోన్. ఫేస్‌బుక్‌లో డిఫరెంట్‌ అకౌంట్స్. లైక్‌ కొట్టితీరాలనిపించే డిఫరెంట్‌ డిఫరెంట్‌ ప్రొఫైల్‌ పిక్స్. ఏ అమ్మాయిని పడేద్దామా అని...

చేతిలో స్మార్ట్‌‌ఫోన్. ఫేస్‌బుక్‌లో డిఫరెంట్‌ అకౌంట్స్. లైక్‌ కొట్టితీరాలనిపించే డిఫరెంట్‌ డిఫరెంట్‌ ప్రొఫైల్‌ పిక్స్. ఏ అమ్మాయిని పడేద్దామా అని ఫేస్‌బుక్‌లో ఫ్రెండ్‌రిక్వెస్ట్‌ల వేట. రిక్వెస్ట్‌ యాక్సెప్ట్‌ చేస్తే, స్వీట్‌గా ఓ పాన్. ఆ తర్వాత అసలు కథా చిత్రం. హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన మరో సోషల్ మీడియా మోసమిది. ఈ స్మార్ట్‌‌ఫోన్లు ఉన్నాయి కదండి. మన జీవితాన్నే మార్చేశాయి. ప్రపంచాన్ని అరచేతిలో పెట్టాయి. ఇక ఇందులోని ఫేస్‌బుక్‌, వాట్సాప్‌లతో అయితే ఎక్కడో అమెరికాలోనో, ఆఫ్రికాలోనో ఉన్న వారితో లైవ్‌లో మాట్లాడుతున్నాం. ఫ్రెండ్స్, బంధువులు, సహచరులను టచ్‌లో ఉంచిన ఘనత ఫేస్‌బుక్‌దే. కానీ వద్దనుకున్నా వచ్చిపడే ఫ్రెండ్‌ రిక్వెస్టులు కొందరి జీవితాల్లో కల్లోలం రేపుతున్నాయి. చాటింగ్‌లు చీటింగ్‌లకు దారి తీస్తున్నాయి. అలా భాగ్యనగరంలో ఓ మాయగాడి ఫ్రెండ్‌రిక్వెస్ట్‌ వలకు చిక్కి, పోలీస్‌ స్టేషన్‌ మెట్లెక్కింది ఓ సాఫ్ట్‌వేర్‌ అమ్మాయి.

స్మార్ట్‌‌ఫోన్లు వచ్చాక స్మార్ట్‌‌ చీటర్స్ పెరిగిపోయారు. సోషల్ మీడియాలో ఎన్నిరకాలుగా మోసాలకు తెగిస్తున్నారో ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం. కొందరు ఫేస్‌బుక్‌ మొత్తం జల్లెడ పట్టి అందమైన అమ్మాయిలకు, రిచ్‌గా కనిపించే గాల్స్‌కు రిక్వెస్ట్‌లు పంపిస్తారు. ప్రొఫైల్‌ పిక్చర్‌లో హీరో ఫోటోనో, లేదంటే హ్యాండ్సమ్‌గా ఉన్న వ్యక్తి ఫోటోనే పెట్టుకుంటారు. సాప్ట్‌వేర్ ఇంజనీరో, లేదంటే బిజినెస్‌ మ్యానో అంటూ ప్రొఫైల్ డీటైల్స్ పెట్టుకుంటారు. కొందరు అమ్మాయిలు అబ్బాయిల ఫోటోలను ప్రొఫైల్‌ పిక్‌లుగా పెట్టుకుంటే, అమ్మాయిలు అబ్బాయిల ఇమేజెస్‌ పెట్టుకుని ఛాటింగ్‌ ముగ్గులోకి దింపుతారు. ఇంకొందరు అమ్మాయిల ఫోటోలను హ్యాక్ చేసి, పోర్న్‌ సైట్లకు అమ్ముతామంటూ బ్లాక్‌మెయిల్ చేస్తున్నారు.

ఫేస్‌బుక్ బాధితుల్లో అమ్మాయిలే అధికం. అందుకే యువతులు చాలా జాగ్రత్త ఉండాలంటున్నారు నిపుణులు. అపరిచిత వ్యక్తుల నుంచి ఫ్రెండ్‌ రిక్వెస్టులు వస్తే, యాక్సెప్ట్ చేయకూడదు. పరిచయస్తులతోనే స్నేహం, చాటింగ్ చేయడం మేలు. అయినా కూడా వ్యక్తిగత, ఆంతరంగిక విషయాలు, ప్రస్తావించకూడదు. ఎవరైనా బ్లాక్‌మెయిల్‌ చేస్తే, నిర్భయంగా కుటుంబ సభ్యుల సహకారంతో పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories