Top
logo

ఫలితాలు అప్పుడే ప్రకటిస్తా.. అది నిజం కాదు : మాజీ ఎంపీ లగడపాటి

ఫలితాలు అప్పుడే ప్రకటిస్తా.. అది నిజం కాదు : మాజీ ఎంపీ లగడపాటి
X
Highlights

గతవారం రోజులుగా సామజిక మాధ్యమాల్లో లగడపాటి సర్వే పేరిట ఓ రిపోర్ట్ తెగ హల్చల్ చేస్తోంది. తెలంగాణలో ముందస్తు...

గతవారం రోజులుగా సామజిక మాధ్యమాల్లో లగడపాటి సర్వే పేరిట ఓ రిపోర్ట్ తెగ హల్చల్ చేస్తోంది. తెలంగాణలో ముందస్తు ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో అనేది ఆ రిపోర్ట్ సారాంశం.. అయితే ఈ సర్వే ఫలితాలపై మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ స్పందించారు. తాను ఏ సర్వే చేయలేదని.. సామజిక మాధ్యమాల్లో తన పేరిట వస్తున్న సర్వే రిపోర్ట్ తనకు సంబంధం లేదని స్పష్టం చేశారు. ఎన్నికల షెడ్యూల్‌ విడుదలై, నామినేషన్ల ప్రక్రియ తర్వాతే జననాడిని తెలుసుకుని సర్వే ఫలితాలను వెల్లడిస్తానని వివరించారు. అంతవరకూ తన పేరిట సామజిక మాధ్యమాల్లో ఏ ప్రచారం జరిగినా.. అవి కేవలం వేరొకరి కల్పితాలేనని లగడపాటి రాజగోపాల్ అన్నారు.

Next Story