logo
జాతీయం

ముందస్తు ఎఫెక్ట్ : కాంగ్రెస్ లోకి మరో నేత

ముందస్తు ఎఫెక్ట్ : కాంగ్రెస్ లోకి మరో నేత
X
Highlights

ముందస్తు ఎన్నికల కోసం కేసీఆర్ నేతృత్వంలోని తెరాస ప్రభుత్వాన్ని తొమ్మిది నెలల ముందుగానే రద్దు చేశారు. ఈ క్రమంలో ...

ముందస్తు ఎన్నికల కోసం కేసీఆర్ నేతృత్వంలోని తెరాస ప్రభుత్వాన్ని తొమ్మిది నెలల ముందుగానే రద్దు చేశారు. ఈ క్రమంలో నవంబర్ లో ఎన్నికలు జరుగుతాయన్నఊహాగానాల నేపథ్యంలో నేతలు, ఎవరిదారి వారు చూసుకుంటున్నారు.ఇందులో భాగంగా మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత నందీశ్వర్‌గౌడ్‌ ఆ పార్టీకి గుడ్‌ బై చెప్పారు. 2014లో కాంగ్రెస్‌ తరపున ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిపోయిన ఆయన.. గతఏడాదే బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే ముందస్తు నేపథ్యంలో అయన మళ్లీ హస్తం గూటికి చేరుకున్నారు. కుంతియా, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జానారెడ్డిలతో భేటీ అయిన నందీశ్వర్‌గౌడ్‌కు.. పటాన్‌చెరు టికెట్‌పై నేతల నుంచి హామీ లభించినట్టు తెలుస్తోంది.

Next Story