logo
ఆంధ్రప్రదేశ్

కాంగ్రెస్ నాయకురాలు, మాజీ ఎమ్మెల్యే మృతి..

కాంగ్రెస్ నాయకురాలు, మాజీ ఎమ్మెల్యే మృతి..
X
Highlights

మాజీ ఎమ్మెల్యే, మాజీ పీఏసీ చైర్మన్‌, కాంగ్రెస్ పార్టీ నాయకురాలు గాదం కమలాదేవి(86) గురువారం ఉదయం కన్నుమూశారు....

మాజీ ఎమ్మెల్యే, మాజీ పీఏసీ చైర్మన్‌, కాంగ్రెస్ పార్టీ నాయకురాలు గాదం కమలాదేవి(86) గురువారం ఉదయం కన్నుమూశారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కమలాదేవి తూర్పుగోదావరి జిల్లా కాకినాడ నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ఈ తెల్లవారుజామున మృతి చెందారు. ఆమెకు ముగ్గురు కుమారులు, కుమార్తె అనురాధ ఉన్నారు. కమలాదేవి 1972లో జిల్లాలోని పామర్రు నియోజవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. గతంలో తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు, టీటీడీ సభ్యురాలు గానూ, క్వాయర్ బోర్డ్ సభ్యురాలుగానూ పనిచేశారు. కమలాదేవి మృతితో కాంగ్రెస్ పార్టీలో విషాదం నెలకొంది. ఆమె మృతి పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Next Story