ఆ టికెట్ మాదే జగన్ మాట తప్పడు : గౌరు వెంకట్ రెడ్డి

ఆ టికెట్ మాదే జగన్ మాట తప్పడు : గౌరు వెంకట్ రెడ్డి
x
Highlights

కర్నూల్ జిల్లా పాణ్యం నియోజకవర్గంలో అప్పుడే లుకలుకలు మొదలయ్యాయి.ఇటీవల బీజేపీ నేత, పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి వైసీపీలో చేరారు. ఈ...

కర్నూల్ జిల్లా పాణ్యం నియోజకవర్గంలో అప్పుడే లుకలుకలు మొదలయ్యాయి.ఇటీవల బీజేపీ నేత, పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి వైసీపీలో చేరారు. ఈ పరిణామం స్థానిక శాసనసభ్యురాలు గౌరు చరితారెడ్డి, ఆమె భర్త వెంకట రెడ్డికి రుచించలేదు.తమను కాదని వేరే పార్టీలోని నేతను చేర్చుక్లోవడం పట్ల భవిశ్యత్ లో టికెట్ రాదేమోనని సందేహపడుతున్నారు. దీంతో గురువారం సాయంత్రం కార్యకర్తల మీటింగ్ ఏర్పాటు చేశారు వైసీపీ కర్నూల్ జిల్లా కన్వీనర్ గౌరు వెంకట రెడ్డి. ఈ సందర్బంగా కాటసానిపై మండిపడ్డారు.. అధినేత జగన్మోహన్ రెడ్డి కష్టాల్లో ఉన్న సమయంలో ఆయనవెంట నడవకుండా కాంగ్రెస్ తో అంటకాగి. చివరకు ఆ పార్టీలో భవిష్యత్ లేదని బీజేపీలో చేరిన కాటసాని తిరిగి వైసీపీలోకి రావడాన్ని తప్పుబట్టారు. కేవలం పదవులకోసమే వైసీపీలోకి కాటసాని వచ్చారన్న గౌరు అయన అవకాశవాద రాజకీయాలు చేస్తున్నారన్నారు. ఎవరు ఎన్ని చేసినా.. వచ్చే ఎన్నికల్లో చరితకే టిక్కెటని అన్నారు. టికెట్ తమకే ఇస్తున్నట్టు జగన్ గతంలో హామీ ఇచ్చారన్నారు. జగన్ ఇచ్చిన మాట తప్పడు అని ఈ సందర్బంగా వ్యాఖ్యానించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories