టీడీపీకి రాజీనామా చేసిన ఎమ్మెల్యే

టీడీపీకి రాజీనామా చేసిన ఎమ్మెల్యే
x
Highlights

మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత అయిన ప్రత్తిపాడు ఎమ్మెల్యే రావెల కిషోర్‌‌బాబు టీడీపీకి రాజీనామా చేశారు. అలాగే ఎమ్మెల్యే పదవికి సైతం రాజీనామా చేసి ఆ...

మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత అయిన ప్రత్తిపాడు ఎమ్మెల్యే రావెల కిషోర్‌‌బాబు టీడీపీకి రాజీనామా చేశారు. అలాగే ఎమ్మెల్యే పదవికి సైతం రాజీనామా చేసి ఆ లేఖను స్పీకర్ కోడెల
శివప్రసాద్ కార్యాలయానికి పంపించారు. మరోవైపు టీడీపీ ప్రాధమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేసిన ఆయన రాష్ట్ర టీడీపీ కార్యాలయంలో మరో లేఖ అందజేశారు. రేపు (డిసెంబర్ 1న) విజయవాడలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ సమక్షంలో కిషోర్ బాబు జనసేన తీర్ధం పుచ్చుకోనున్నారు. గతకొంత కాలంగా టీడీపీ అధిష్టానంపై అసంతృప్తిగా ఉన్న రావెల పార్టీ మారాలని నిర్ణయించుకున్నారు. అయితే మొదట ఆయన వైసీపీలో చేరాలని అనుకున్నారు. వైసీపీ ఎమ్మెల్యే ఆదిమలపు సురేష్ ద్వారా మంతనాలు సాగించినట్టు ప్రచారం జరిగింది. ప్రత్తిపాడు లేదా వేమూరు టికెట్ ఆశించారు. కానీ జగన్ నుంచి స్పష్టమైన నిర్ణయం రాకపోవడంతో చేసేదేమి లేక ఆయన జనసేన వైపు అడుగులు వేశారు. శనివారం నాగార్జున యూనివర్శిటి నుంచి అభిమానులతో భారీ ర్యాలీగా వెళ్లి రావెల జనసేన కండువా కప్పుకోనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories