సంచలన నిర్ణయం తీసుకున్న గల్లా అరుణకుమారి.. టీడీపీకి షాక్!

సంచలన నిర్ణయం తీసుకున్న గల్లా అరుణకుమారి.. టీడీపీకి షాక్!
x
Highlights

Also Read : వైసీపీ ఎమ్మెల్యే పై ఏసీబీ కేసు నమోదు మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత గల్లా అరుణ కుమారి సంచలన నిర్ణయం తీసుకున్నారు. తనకు పార్టీలో తగిన...

Also Read : వైసీపీ ఎమ్మెల్యే పై ఏసీబీ కేసు నమోదు

మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత గల్లా అరుణ కుమారి సంచలన నిర్ణయం తీసుకున్నారు. తనకు పార్టీలో తగిన గుర్తింపు లేదని సీనియర్ రాజకీయ నాయకురాలైన తనను టీడీపీ అధిష్టానం నిర్లక్ష్యం చేస్తోందని, ఆమె బుధవారం టీడీపీ అధిష్ఠానానికి షాక్ ఇచ్చారు. చంద్రగిరి నియోజకవర్గ ఇంచార్జి బాధ్యతల నుంచి తప్పుకున్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా పోటీ చేయనని అధినేతకు తేల్చి చెప్పారు. పైగా తన కూతురు కానీ ఇతర కుటుంసభ్యులు కానీ చంద్రగిరి నుంచి పోటీ చేయబోరని స్పష్టం చేశారు. వయోభారం కారణంగా తాను ఈ నిర్ణయం తీసుకున్నట్టు పైకి ప్రచారం జరిగినా ఆమె అలకకు కారణం లేకపోలేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. సుదీర్ఘ కాలం కాంగ్రెస్ లో ఉండి మంత్రిగా కొనసాగిన అనంతరం గత ఎన్నికల సందర్బంగా టీడీపీలో చేరిన గల్లా కుటుంబం పట్ల టీడీపీ అధిష్టానం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆమె మధనపడిపోతున్నారట. తనని కాదని వైసీపీ నుంచి టీడీపీలో చేరిన అమర్నాధ్ రెడ్డికి మంత్రి పదవి ఇచ్చారన్న అసంతృప్తి ఆమెలో ఉందంటున్నారు. పుండు మీద కారం చల్లినట్టు గత రెండేళ్లుగా కాళీగా ఉన్న చిత్తూర్ ఎమ్మెల్సీ స్థానాన్ని తనకు కాదని గాలి ముద్దుకృష్ణమ నాయుడు కుటుంబానికి ఇచ్చారనేటువంటి కారణాలతో గల్లా అరుణ కుమారి చంద్రగిరి టీడీపీ ఇంచార్జి పదవికి రాజీనామా చేశారని జిల్లాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. గల్లా తీసుకున్న ఈ నిర్ణయం పట్ల టీడీపీ నేతలు షాక్ అవుతున్నారు. నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆమెను కోరినట్టు తెసులుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories