వైయస్ జగన్ ను కలిసిన ఏపీ మాజీ డీజీపీ..

వైయస్ జగన్ ను కలిసిన ఏపీ మాజీ డీజీపీ..
x
Highlights

వైసీపీ అధినేత జగన్ ని ఏపీ మాజీ డీజీపీ నండూరి సాంబశివరావు కలిశారు. విశాఖపట్టణం జిల్లా అచ్యుతాపురం సమీపంలోని ధార భోగాపురంలో ప్రజా సంకల్పయాత్ర శిబిరం...

వైసీపీ అధినేత జగన్ ని ఏపీ మాజీ డీజీపీ నండూరి సాంబశివరావు కలిశారు. విశాఖపట్టణం జిల్లా అచ్యుతాపురం సమీపంలోని ధార భోగాపురంలో ప్రజా సంకల్పయాత్ర శిబిరం వద్ద జగన్ ని ఆయన కలిశారు. ఈ సందర్భంగా జగన్ కు ఆయన పుష్పగుచ్ఛం అందజేశారు. ఇద్దరు సుమారు 15 నిమిషాలు చర్చించుకున్నారు. ఇదిలావుంటే సాంబశివరావు వైసీపీలో చేరుతున్నట్లు విజయసాయిరెడ్డి ప్రకటించారు. సాంబశివరావు చేరికతో వైసీపీకి అదనపు బలం వస్తుందని చెప్పారు. కాగా సాంబశివరావు స్వస్థలం ప్రకాశం జిల్లా ఒంగోలు.1987లో ఆదిలాబాద్ జిల్లాలోని బెల్లంపల్లికి ఏఎస్పీగా ఆయన కెరీర్ ప్రారంభమైంది. ఆ తర్వాత పదోన్నతులు పొందుతూ డీజీపీ స్థాయికి ఎదిగారు. ఏపీ డీజీపీగా గత ఏడాది ఆయన పదవీ విరమణ పొందారు.

Show Full Article
Print Article
Next Story
More Stories