జగన్ ను కలిసిన మాజీ సీఎం కొడుకు

జగన్ ను కలిసిన మాజీ సీఎం కొడుకు
x
Highlights

ఎన్నికలు సమీపిస్తున్న వేళ వివిధ పార్టీలలోకి వలసలు ఊపందుకున్నాయి. ఇప్పటికే వైసీపీనుంచి టీడీపీలోకి కొంతమంది నేతలు వెళ్లిపోయారు. తాజాగా వైసీపీ అధినేత...

ఎన్నికలు సమీపిస్తున్న వేళ వివిధ పార్టీలలోకి వలసలు ఊపందుకున్నాయి. ఇప్పటికే వైసీపీనుంచి టీడీపీలోకి కొంతమంది నేతలు వెళ్లిపోయారు. తాజాగా వైసీపీ అధినేత వైయస్ జగన్ ను మాజీ సీఎం నేదురుమల్లి జనార్దన్ రెడ్డి కుమారుడు రామ్ కుమార్ రెడ్డి కలిశారు. తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం నియోజక వర్గంలో జగన్ ను కలిసిన అయన వైసీపీలో చేరికపై చర్చించారు. కాగా నిన్న (శనివారం) రామ్ కుమార్ రెడ్డిని ఏపీ బీజేపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమించారు కన్నా లక్ష్మీనారాయణ. తాజగా వైసీపీ అయన అధినేతను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. రామ్ కుమార్ రెడ్డి ఇటీవల తన కార్యకర్తలతో మీటింగ్ ఏర్పాటు చేసి పార్టీ మారడంపై చర్చించారు. దాంతో ఎక్కువమంది కార్యకర్తలు వైసీపీలో చేరాల్సిందిగా ఆయనకు సూచించినట్టు తెలుస్తోంది. ఇదిలావుంటే రామ్ కుమార్ రెడ్డి నెల్లూరు జిల్లా వెంకటగిరి ఎమ్మెల్యే సీటు అడుగుతున్నారు. ఆ సీటును మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డికి జగన్ కన్ఫర్మ్ చేసినట్టు ప్రచారం జరుగుతోంది.

Image result for nedurumalli ram kamareddy

Show Full Article
Print Article
Next Story
More Stories