జ‌న‌సేనలోకి సీబీఐ మాజీ జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ‌..?

జ‌న‌సేనలోకి సీబీఐ మాజీ జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ‌..?
x
Highlights

జ‌గ‌న్ - గాలి జ‌నార్ధ‌న్ రెడ్డి ల‌కు మూడు చెరువులు నీళ్లు తాగించిన సీబీఐ మాజీ జాయింట్ డైరక్ట‌ర్ ల‌క్ష్మీనారాయ‌ణ రాజ‌కీయాల్లోకి వ‌స్తున్నారా..? ఏపీకి...

జ‌గ‌న్ - గాలి జ‌నార్ధ‌న్ రెడ్డి ల‌కు మూడు చెరువులు నీళ్లు తాగించిన సీబీఐ మాజీ జాయింట్ డైరక్ట‌ర్ ల‌క్ష్మీనారాయ‌ణ రాజ‌కీయాల్లోకి వ‌స్తున్నారా..? ఏపీకి కేంద్రం చేస్తున్న అన్యాయంపై నిన‌దించ‌డానికి రాజ‌కీయ పార్టీని ఏర్పాటు చేయ‌నున్నారా..? రాజ‌కీయాల్లోకి బీజేపీ తీర్ధం పుచ్చ‌కుంటారా..? లేదంటే ఏపీ ప్ర‌భుత్వం చేసిన అవినీతిపై ఏకి పారేస్తున్న జ‌న‌సేన పార్టీలో చేరుతున్నారా..? అంటే అవున‌నే అంటున్నారు ఆయ‌న స్నేహితులు

.
సీబీఐ జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ..! మొదట్లో ఆయన గురించి పెద్దగా ఎవరికీ తెలియదు. ఆయన వచ్చిన కొత్తలో తొలుత ఫోక్స్‌ వ్యాగన్‌ కేసు నమోదైంది. ఆ తర్వాత హైకోర్టు ఆదేశాల మేరకు వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి హయంలో తలపెట్టిన అవుటర్‌ రింగ్‌రోడ్డులో భూసేకరణ, అందులో జరిగిన అక్రమాలకు సంబంధించి దర్యాప్తు జరిపి న్యాయస్థానానికి నివేదిక సమర్పించారు. ఇది సద్దుమణిగేలోపే సత్యం కంప్యూటర్స్‌ కుంభకోణం కేసు సీబీఐకి బదిలీ అయింది. రూ.ఏడు వేలకోట్ల కుంభకోణానికి సంబంధించిన ఈ కేసుపై సమర్థంగా దర్యాప్తు జరిపిన లక్ష్మీనారాయణ పేరు దేశవ్యాప్తంగా మారుమోగింది. ఈ కేసు కొలిక్కి వచ్చేలోపే దాదాపు ఒకే సమయంలో ఓబుళాపురం మైనింగ్‌ కంపెనీ (ఓఎంసీ) కేసు, జగన్‌ అక్రమ ఆస్తుల కేసు, ఎమ్మార్‌ ప్రాపర్టీస్‌ కేసులు నమోదయ్యాయి. ఇవన్నీ ప్రజాప్రతినిధులు తమ అధికారాన్ని అడ్డంపెట్టుకొని భారీగా అక్రమాలకు పాల్పడ్డ కుంభకోణాల కేసులే. ఓఎంసీ కేసు దర్యాప్తులో భాగంగా కర్ణాటక ఎంపీ గాలి జనార్దనరెడ్డి, ఓఎంసీ ఎండీ శ్రీనివాసరెడ్డిలను అరెస్టు చేయడంతో లక్ష్మీనారాయణ వార్తల్లో వ్యక్తి అయ్యారు. అది మొదలు ఓఎంసీ కేసులో వరుసగా అరెస్టులు జరిగాయి. సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి శ్రీలక్ష్మి, మైనింగ్‌ శాఖ ఉన్నతాధికారి రాజ్‌గోపాల్‌ తదితరులను అరెస్టు చేశారు. దీంతోపాటు ఎమ్మార్‌ ప్రాపర్టీస్‌ కేసులో పారిశ్రామికవేత్త కోనేరు ప్రసాద్‌, సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి బి.పి.ఆచార్యలను అరెస్టు చేశారు. ఇదే సమయంలో జగన్‌ అక్రమ ఆస్తుల కేసు దర్యాప్తులో భాగంగా మరో ప్రముఖ పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్‌, అప్పటి మంత్రి మోపిదేవి వెంకట రమణ తదితరులతోపాటు కడప ఎంపీ, వైసీపీ అధినేత‌ జగన్‌ను కూడా అరెస్టు చేశారు.అక్ర‌మాస్తుల కేసులో జ‌గ‌న్ కేసు ద‌ర్యాప్తు కొన‌సాగుతుంది. కేసునిమిత్తం జ‌గ‌న్ ప్ర‌తీ శుక్ర‌వారం కోర్టుకు హాజ‌ర‌వుతున్న విష‌యం తెలిసిందే.


కాగా ప్ర‌స్తుతం మ‌హారాష్ట్ర అద‌న‌పు డీజీపీగా ఉన్న‌ ల‌క్ష్మీనారాయ‌ణ వీఆర్ఎస్ కు ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. ఈ సంద‌ర్భంగా స్వ‌చ్ఛంద ప‌ద‌వీ విర‌మ‌ణ కావాలంటూ మ‌హ‌రాష్ట్ర డీజీపీకి లేఖ రాశారు. ఆ లేఖ‌పై స్పందించిన ఆయ‌న సన్నిహితులు, అభిమానులు ర‌క‌ర‌క‌లా అభిప్రాయాల్ని వ్య‌క్తం చేస్తున్నారు. ప‌ద‌వీ కాలం ఉన్నా స‌డ‌న్ గా వీఆర్ఎస్ తీసుకోవ‌డంపై ల‌క్ష్మీనారాయ‌ణ త్వ‌రలో రాజ‌కీయాల్లోకి వ‌స్తున్న‌ట్లు ఆయన స‌న్నిహితులు చెబుతున్నారు. వీఆర్ఎస్ అనంత‌రం బీజేపీలోకి గాని, జ‌న‌సేన పార్టీ తీర్ధం పుచ్చుకునే అవ‌కాశాలు ఉన్న‌ట్లు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories