యంత్రంలో తంత్రమా? ఇదీ ఈవీఎంల దుమారం కథ!!

యంత్రంలో తంత్రమా? ఇదీ ఈవీఎంల దుమారం కథ!!
x
Highlights

ఎండ దెబ్బకు జనమే కాదు.. ఓటింగ్ మిషన్లు కూడా మూర్ఛపోతున్నాయి.. పని చేయకుండా మొరాయిస్తున్నాయి.. దేశవ్యాప్తంగా జరిగిన ఉపఎన్నికల్లో యూపిలో ఈవీఎంలు...

ఎండ దెబ్బకు జనమే కాదు.. ఓటింగ్ మిషన్లు కూడా మూర్ఛపోతున్నాయి.. పని చేయకుండా మొరాయిస్తున్నాయి.. దేశవ్యాప్తంగా జరిగిన ఉపఎన్నికల్లో యూపిలో ఈవీఎంలు మొరాయించడం పెద్ద దుమారాన్నే రేపింది.. ఇన్నాళ్లూ విపక్షాలే ఈవీఎంలను విమర్శిస్తుంటే.. ఇవాళ బిజెపి కూడా వాటితో శృతి కలిపింది. ప్రజాస్వామ్యంలో పారదర్శక ఎన్నికలకు వేదమంత్రంగా చెప్పుకుంటున్న ఈవిఎంల పై సందేహాలు పెరుగుతున్నాయి. ఒకప్పుడు ఆధునికతకు, వేగానికి, నిస్పాక్షికతకు, పారదర్శకతకు కొలమానంగా చెప్పుకునే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లపై ఇప్పుడు సవాలక్ష సందేహాలు రేగుతున్నాయి.

ఈవిఎంల రాకతో పెద్ద పెద్ద నియోజక వర్గాలలోనూ, కొండ కోనల్లోనూ ఎన్నికల నిర్వహణ చాలా సునాయాసంగా మారిపోయింది.. అయితే ఆ మిషన్ల వినియోగంపై సిబ్బందికి తగిన తర్ఫీదు లేనప్పుడు మాత్రం వాటి వినియోగం కష్టంగానే మారుతుంది.ఈ విఎంలను ట్యాంపరింగ్ చేయవచ్చని అధికార పార్టీ రిగ్గింగ్ యంత్రాంలుగా ఈవిఎంలు మారిపోతున్నాయని ప్రతిపక్షాలు ఆరోపించడం, నిందలేయడం సహజం.. కానీ ఇప్పుడు అధికార పార్టీ కూడా ఈవిఎంల పనితీరుపై సందేహాలు లేవనెత్తుతోంది.దేశ వ్యాప్తంగా సోమవారం నాలుగు లోక్ సభ స్థానాలు, 9 శాసన సభ నియోజక వర్గాలకు ఉప ఎన్నికలు జరిగాయి.

ఉత్తర ప్రదేశ్ లోని కైరానా లోక్ సభ, నూర్ పూర్ శాసన సభ నియోజక వర్గ ఉప ఎన్నికల్లో ఉపయోగించిన వందల ఈవిఎంలు, ఓటు ధృవీకరణ రసీదు యంత్రాలు మొరాయించాని విపక్షాలు, అధికార బిజెపి కూడా ఆరోపించాయి. ఈవిఎంలు సరిగా పనిచేయని చోట బిజెపి ట్యాంపరింగ్ చేసిందంటూ విపక్షాలు ఎస్పీ, బిఎస్పీ ఆరోపించాయి.అయితే ఈ ఆరోపణలను ఎన్నికల సంఘం ఖండించింది. ఈ విఎంల వినియోగంపై సిబ్బంది శిక్షణా కార్యక్రమాలకు హాజరు కాలేదని మరికొందరు శిక్షణా సమయంలో ఫోన్లు చూసుకుంటూ గడిపేశారని ఎన్నికల సంఘం ఆరోపించింది. అలాంటి వారు ఈవిఎంలను ఎక్కువ ఎండ ఉండే చోట పెట్టారని, అందువల్లే యంత్రాలు వేడెక్కి సమస్య వచ్చిందన్నది అధికారుల సమాధానం. ఒక శాతం లోపు ఈవిఎంలను, 11 శాతం పైగా ఓటు రసీదు యంత్రాలను మార్చామని ఎన్నికల సంఘం తెలిపింది.కైరానా, నూర్ పుర్ లో 197 బూత్ లలో చాలా సేపు ఈవిఎంలు పనిచేయలేదని బిజెపి నేతలు సైతం ఆరోపించారు.. ఇక నాగాలాండ్ లోక్ సభ స్థానానికి, మహారాష్ట్రలోని పాల్ ఘర్ భండారా, గోండియా లోక్ సభ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. అక్కడా ఈవిఎంలు, ఓటు ధృవీకరణ రసీదు యంత్రాలు సరిగా పనిచేయలేదన్న ఆరోపణలు వచ్చాయి.ఈవిఎంలు రేపిన గందరగోళంపై శివసేన, ఎన్సీపీలు మండిపడ్డాయి.25 శాతం ఈవిఎంలు సరిగా పనిచేయలేదని మాజీ కేంద్ర మంత్రి, ఎన్సీపి నేత ప్రఫుల్ పటేల్ అన్నారు.

ఉప ఎన్నికల సందర్భంగా ఈవీఎంలపై ఇవాళ పంచాయితీ రేగినా.. దేశవ్యాప్తంగా గత కొంత కాలంగా ఈవీఎం ఓటింగ్ విధానంపై చర్చ జరుగుతోంది. ఈవిఎంలు సులభంగా రిగ్గింగ్ చేసేందుకు ఉపయోగపడతాయనీ, అందువల్ల బ్యాలెట్ పేపరే బెటర్ అనే వాదనలు వినిపిస్తున్నాయి.. యూపి, గుజరాత్ సహా ఇతర రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి ఈవిఎంల సాయంతో రిగ్గింగ్ చేసిందని విపక్షాలు ఆరోపించాయి.. కానీ ఈ విఎంలను రిగ్గింగ్ చేయడం సాధ్యం కాదని రాజకీయ పార్టీలు చేసేవి అర్ధం లేని ఆరోపణలేనని మాజీ ఎన్నికల కమిషనర్ నవీన్ చావ్లా లాంటి అధికారులు చెబుతున్నారు.. విదేశాల్లో సైతం ఈవిఎం మిషన్లనే ఓటింగ్ కి వినియోగిస్తున్న నేపధ్యంలో వేగంగా ఓటింగ్ ప్రక్రియను పూర్తి చేసే ఈ సాధనంపై అనుమానాలూ అంతే రేంజ్ లో పెరుగుతున్నాయి.. ఈవీ ఎంలు రిగ్గింగ్ సాధనాలా?ఈ వీ ఎంల ద్వారా ఎన్నికల ఫలితాలను సునాయాసంగా మార్చేయవచ్చా?పవర్ లో ఉన్న పార్టీలకి ఈవీఎం లు గెలుపు మంత్రంగా పనిచేస్తున్నాయా? ఈవీ ఎంల విశ్వసనీయత ఎంత?

Show Full Article
Print Article
Next Story
More Stories