ప్రపంచానికి క్రిస్మస్ ఇచ్చే ప్రేమ సందేశమేంటి?

ప్రపంచానికి క్రిస్మస్ ఇచ్చే ప్రేమ సందేశమేంటి?
x
Highlights

ప్రపంచంలోనే అతిపెద్ద మతం క్రైస్తవ్యం. ప్రపంచ జనాభాలో దాదాపు మూడోవంతు ప్రజలు క్రిస్మస్ ఆరాధనల్లో పాల్గొంటారని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా...

ప్రపంచంలోనే అతిపెద్ద మతం క్రైస్తవ్యం. ప్రపంచ జనాభాలో దాదాపు మూడోవంతు ప్రజలు క్రిస్మస్ ఆరాధనల్లో పాల్గొంటారని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా క్రీస్తు జన్మస్థలమైన బెత్లహేంలో ప్రతి ఏడాది క్రిస్మస్ వేడుకలు వైభవంగా సాగుతాయి. ప్రపంచ రోమన్ క్యాథలిక్‌ల కేంద్రమైన వాటికన్‌ సిటీలో వందలాదిమంది క్రీస్తు జన్మదినోత్సవంలో పాల్గొంటారు. జెరూసలేంలోని బెత్లహేం అనే చిన్న గ్రామంలో జన్మించాడు యేసుక్రీస్తు. కన్య మరియకు పుట్టాడు. యేసు జననం గురించి కొన్ని వేల సంవత్సరాల క్రితమే బైబిల్ లోని పాతనిబంధన గ్రంథంలో భక్తులు ప్రవచించారు. చిన్న పశువుల పాకలో కరుణామయుడు పుట్టాడు. యేసు ప్రభువు క్రీస్తుపూర్వం 7 నుంచి 2వ శతాబ్దం మధ్యలో జన్మించి ఉంటారని చరిత్రకారుల అభిప్రాయం. కానీ ఇదే సంవత్సరంలో పుట్టాడన్న ఆధారాల్లేవు. అయితే అప్పుడున్న వాతావరణ పరిస్థితులను బట్టి అంచనావేస్తున్నారు.

బెత్లహేమును ఎంతోమంది రాజులు పాలించారు. సుసంపన్నంగా పాలన సాగించారు. పేరు ప్రఖ్యాతులు పొందారు. మహామహా రాజులను పాలించినా ప్రపంచదృష్టిని ఆకర్షించలేదు బెత్లహేం. కానీ జీజస్ పుట్టుకతో బెత్లహేం అనే చిన్న గ్రామం రూపు రేఖలే మారిపోయాయి. ఆసియాకు సరిగ్గా మధ్యలో ఉన్న బెత్లహేం ఇప్పుడు ప్రపంచ ఆధ్యాత్మిక క్షేత్రం. యేసుక్రీస్తు భూమిపై జీవించిన కాలం మొత్తం ముప్పై మూడున్నర సంవత్సరాలు. తను ఈలోకంలో ఉన్నంత కాలం ప్రేమ, శాంతి, అహింస గురించి బోధించారు. సోదరభావం, ప్రేమతత్వాన్ని అలవర్చుకోవాలన్నారు. ఈలోకంలో ఉన్నవన్నీ అశాత్వమైనవని, శాశ్వతమైన పరలోక జీవితం గురించి ఆలోచించాలని చెప్పారు. మారు మనస్సు పొంది దేవునికి నమ్మకంగా ఉండాలన్నారు. జీజస్ క్రైస్ట్‌కు చిన్న పిల్లలంటే ఎంతో ఇష్టం. వారితో మాట్లాడ్డానికి, మంచి మాటలు చెప్పడానికి ఉత్సాహం చూపేవాడు. తన దగ్గరకు వస్తున్న పిల్లలను ఆటంకపరచొద్దని చెప్పాడు.
.
అంతేకాదు క్రీస్తు ఎంతోమంది రోగులకు స్వస్థతనిచ్చాడని బైబిల్ చెబుతోంది. అంధులకు చూపు ప్రసాదించాడని, చనిపోయిన వారిని తిగరిలేపాడని, శాశ్వత జీవాన్ని ఇస్తానని మాట ఇచ్చాడని సెలవిస్తోంది. క్రిస్మస్. అంటే క్రీస్తు ఆరాధన. క్రిస్మస్ వేడుకలు జరుపుకోవడమంటే, యేసు జననాన్ని, మరణాన్ని, పునరుత్తాన్ని గుర్తు చేసుకోవడం, ఆయన మాటలు, బాటలు మననం చేసుకోవడం, సిలువ యాగాన్ని స్మరించుకోవడం. పూర్వం అసలు క్రిస్మస్ పండగను జరుపుకునేవారు కాదు. ఎందుకంటే, క్రీస్తు జన్మించిన తేదీపై పూర్తి క్లారిటీలేదు. బైబిల్‌లో క్రీస్తు జనన తేదీ, ఇదేనని లిఖించలేదు. కొందరు డిసెంబర్ 14, మరికొందరు ఫిబ్రవరి రెండు, ఇంకొందరు జూన్‌ 10 అంటూ ఎవరికివారు వాదనలు వినిపించారు. మొత్తానికి అందరూ ఒక అంగీకారానికి వచ్చి, తేదీని ఖరారు చేశారు. అలా మూడో శతాబ్దంలో క్రీస్తు పుట్టినరోజు వేడుకలు ప్రారంభమయ్యాయి. ఎనిమిదో శతాబ్దానికంతా, యూరప్‌తో పాటు అనేక దేశాల్లో డిసెంబర్‌ 25న క్రిస్మస్ సంబరాలు మొదలయ్యాయని చరిత్రకారులు చెబుతారు.

Show Full Article
Print Article
Next Story
More Stories