చెత్త రూపంలో రూ. 6,347కోట్ల బంగారం

చెత్త రూపంలో రూ. 6,347కోట్ల బంగారం
x
Highlights

బంగారం ప్ర‌తీ సంవ‌త్సరం వేల‌కోట్ల‌లో వృథాగా పోతుంద‌ని మార్కెట్ వ‌ర్గాలు తెలిపాయి. ఐక్య‌రాజ్య‌స‌మితి ఆధీనంలో ఉన్న అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్‌...

బంగారం ప్ర‌తీ సంవ‌త్సరం వేల‌కోట్ల‌లో వృథాగా పోతుంద‌ని మార్కెట్ వ‌ర్గాలు తెలిపాయి. ఐక్య‌రాజ్య‌స‌మితి ఆధీనంలో ఉన్న అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్‌ యూనియన్‌(ఐటీయూ) ఓ నివేదిక‌ను విడుద‌ల చేసింది. ఆ నివేదిక ఆధారంగా ప్ర‌తీ ఏటా ఈ వేస్టేజ్ రూపంలో రూ. 6,347కోట్ల బంగారం , రూ.300కోట్ల విలువైన వెండి వృథాగా పోతుంద‌ని తేలింది. ఐటీయూ ప్ర‌తీఏటా జ‌రిపే లెక్క‌ల గ‌ణాంకాల‌లో 2016లో భారత్‌లో 2 మిలియన్‌ టన్నుల ఇ-వేస్ట్‌ వచ్చిన‌ట్లు వెల్ల‌డైంది. వీటితో పాటు భారత్‌లో 728 కిలోటన్నుల ఇనుము, 96.8 కిలోటన్నుల రాగి, రూ.300కోట్ల వెండి రూ.3,262 కోట్ల విలువైన రాగి, రూ. 1,228 కోట్ల విలువైన అల్యూమినియం చెత్త రూపంలో వెళ్లిపోయాయి. ఇక ప్రపంచ వ్యాప్తంగా 2016లో 44.7 మిలియన్‌ టన్నుల ఇ-వేస్ట్ ఉత్పత్తి అయ్యింది. ఇది 4,500 ఈఫిల్‌ టవర్లకు సమానమని నివేదిక తెలిపింది. ఈ వేస్టేజ్ మన దేశంలో దిల్లీ సహా అహ్మదాబాద్‌, చెన్నై, ముంబయి తదితర ప్రధాన నగరాల్లో ఇది ఎక్కువగా ఉంటోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories