ఖాళీ సీట్లతో ప్రయాణిస్తున్న విమానాలు

ఖాళీ సీట్లతో ప్రయాణిస్తున్న విమానాలు
x
Highlights

ప్రస్తుతం దేశంలోని విమానయాన సంస్థలు గడ్డుకాలం ఎదుర్కొంటున్నాయి. పెరుగుతున్న ఇంధన వ్యయాలకు అనుగుణంగా టిక్కెట్ల రేట్లను పెంచలేక పోతోంది, అంతేకాకుండా...

ప్రస్తుతం దేశంలోని విమానయాన సంస్థలు గడ్డుకాలం ఎదుర్కొంటున్నాయి. పెరుగుతున్న ఇంధన వ్యయాలకు అనుగుణంగా టిక్కెట్ల రేట్లను పెంచలేక పోతోంది, అంతేకాకుండా తక్కువ ధరలతో నే విమాన ప్రయాణం అంటూ ఆఫర్లు ప్రకటిస్తుండటంతో దేశీయ ఎయిర్ లైన్స్ రంగం కుదేలైంది. ఒక వైపు స్వల్పకాలిక రుణ బాధలు, ఇప్పటికే పలు ప్రైవేట్ విమాన యాన సంస్థలు అప్పుల ఊబిలో చిక్కుకున్నాయి. అన్ని రూట్లలోను ఖాళీ సీట్లతో విమానాలు వెళుతున్నాయి. గత అక్టోబర్‌ నాటికి అత్యంత కనిష్టంగా 83 శాతం ప్రయాణికులు తగ్గిపోయారంటే అతిశయోక్తి కాదు. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్‌ సివిల్ ఏవియేషన్ రిలీజ్ చేసిన సమాచారం ప్రకారం గత 2017 మార్చ్ నుండి ఇప్పటి వరకూ దేశీయ విమాన యాన సంస్థల ఆక్యుపెన్సీ(ప్రయాణికుల సంఖ్య) దారుణంగా పడిపోయిందని పేర్కొంది. గత 19 నెలల కనిష్టానికి పడిపోవడంతో అత్యంత వేగంగా వృద్ధి చెందుతుందన్న దేశీయ విమాన యాన రంగం ఒక్కసారిగా కుదుపుకు లోనైందని ఆ సంస్థ వెల్లడించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories