logo
ఆంధ్రప్రదేశ్

లారీ యజమానులు చర్చలు.. మరో కీలక నిర్ణయం

లారీ యజమానులు చర్చలు.. మరో కీలక నిర్ణయం
X
Highlights

నాలుగు రోజులుగా లారీల సమ్మె కొనసాగుతోంది.నిన్నటిదాకా అత్యవసర సరుకులు, పెట్రోలు, డీజిల్, మందులు, ఇతర నిత్యావసర...

నాలుగు రోజులుగా లారీల సమ్మె కొనసాగుతోంది.నిన్నటిదాకా అత్యవసర సరుకులు, పెట్రోలు, డీజిల్, మందులు, ఇతర నిత్యావసర సరుకుల రవాణాకు మినహాయింపు ఇవ్వగా.. సమ్మెపై పెద్దగా ప్రభావం చూపలేదు. ఈ క్రమంలో మంగళవారం నుంచి అత్యవసర సరుకుల రవాణాను కూడా నిలిపేసే విధంగా లారీల యజమానులు చర్చలు జరుపుతున్నారు. రాబోయే రెండు రోజుల్లో సమ్మెను మరింత ఉధృతం చేయాలని భావిస్తున్నారు. ఇందుకోసం తెలుగురాష్ట్రాల లారీల యాజమాన్యం జెఏసి భేటీ అయింది. ఏ క్షణానైనా ఈ నిర్ణయం ప్రకటించే అవకాశమున్నందున ప్రభత్వ పెద్దలు దీనిపై దృష్టి సారించినట్టు తెలుస్తోంది. కాగారెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి మొత్తం 5 లక్షలకు పైగా లారీలున్నాయి. లారీల సమ్మె కారణంగా ప్రభుత్వానికి రోజుకు రూ.25 కోట్ల నష్టం వాటిల్లుతున్నట్లు అంచన.

Next Story