సోషల్ మీడియాలపై అధికారుల నిఘా

సోషల్ మీడియాలపై అధికారుల నిఘా
x
Highlights

ప్రత్యర్థి పార్టీలపై బురద జల్లేందుకు కొన్ని రాజకీయ పార్టీలు, నాయకులు సామాజిక మాధ్యమాలను ఆయుదంలా మార్చుకుంటున్నారు. ప్రధాన పార్టీల మద్దతుదారులు...

ప్రత్యర్థి పార్టీలపై బురద జల్లేందుకు కొన్ని రాజకీయ పార్టీలు, నాయకులు సామాజిక మాధ్యమాలను ఆయుదంలా మార్చుకుంటున్నారు. ప్రధాన పార్టీల మద్దతుదారులు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాపల్‌లలో అభ్యంతరకర చిత్రాలు పంపుతూ భావోద్వేగాలను రెచ్చగొట్టే దృశ్యాలపై పోలీస్ ఉన్నతాధికారులు దృష్టి కేంద్రీకరించారు. ఎన్నికల ప్రచారం ముగియడంతో సామాజిక మాధ్యమాలపై పోలీసులు నిఘా పెట్టారు..

తెలంగాణలో ఎన్నికల ప్రచారం ముగిసింది.. దీంతో రాజకీయ నాయకులు, పార్టీలు బహిరంగ సభలు, ప్రచారం నిర్వహించకూడదు అయితే సామాజిక మాధ్యమాల్లో ప్రచారంపై ఎలాంటి నిబంధనలూ లేక పోవడం తో ప్రధాన పార్టీలతో సహా వారి మద్దతుదారులు కూడా అందరూ పోలింగ్ ముగిసే వరకు ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌లపై పడ్డారు దీంతో సామాజిక మాధ్యమాలపై పోలీస్ ఉన్నతాధికారులు ప్రత్యేక నిఘా పెట్టారు.

సామాజిక మాధ్యమాల్లో నాయకులను, పార్టీలను కించపరస్తూ అభ్యంతరకర దృశ్యాలను వీడియోలు, లేదా ఫోటోలు పెడితే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు ఇలాంటి దృశ్యాలపై నాయకులు, ప్రతినిధులు పోలీసులకు ఫిర్యాదు ఇస్తే ఐటీ చట్టం ప్రకారం కేసులు నమోదు చేస్తున్నామని అధికారులు తెలిపారు. హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీస్‌ స్టేషన్‌లో సోషల్ మీడియాల్లో వచ్చే అభ్యంతరకత పోస్టులను పరిశీలించేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు.

సామాజిక మధ్యమాల్లో రాజకీయ పార్టీలకు సంబంధించిన దృశ్యాలను ఎప్పిటికప్పుడు పరిశీలించి అభ్యంతరకరమైనవి ఏమైనా ఉంటే వాటిని అధికారులు రికార్డు చేయనున్నారు అనంతరం సదరు చిత్రం, వీడియో ఎక్కడి నుంచి వచ్చిందో పరిశీలించి వాటిని తొలిగిస్తారు ఇక సృతి మించి ప్రవర్తిస్తే కేసులు నమోదు చేసి పోస్ట్ పెట్టిన వారిని అరెస్ట్ చేస్తారు. ఏదేమైనా సామాజిక మాధ్యమాల ప్రచారంపై ఎలాంటి నిఘా లేక పోవడంతో పలు పార్టీలు ఇప్పుడు సోషల్ మీడియాల్లో ప్రచారం చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories