ఇంతకీ గుడ్డు వెజిటేరియనా? నాన్‌ వెజిటేరియనా?

ఇంతకీ గుడ్డు వెజిటేరియనా? నాన్‌ వెజిటేరియనా?
x
Highlights

సండే హోయా మండే.. రోజ్ ఖావో అండే. ఇది వెరీ పాపులర్‌ స్లోగన్‌. కుల, మతాలకు అతీతంగా అందరూ తినే పోషకాహారం గుడ్డు. ఇలా మొత్తంగా ఎగ్గేరియన్స్‌ మాత్రం...

సండే హోయా మండే.. రోజ్ ఖావో అండే. ఇది వెరీ పాపులర్‌ స్లోగన్‌. కుల, మతాలకు అతీతంగా అందరూ తినే పోషకాహారం గుడ్డు. ఇలా మొత్తంగా ఎగ్గేరియన్స్‌ మాత్రం ఫుల్లుగా పెరిగిపోతున్నారు. ప్రతీ కుటుంబంలో ఎంతో ప్రయారిటీ ఫుడ్‌గా ఉన్న గుడ్డుపై కొన్ని అనుమానాలున్నాయి. అసలింతకీ ఎగ్గు వెజిటేరియనా? నాన్‌ వెజిటేరియనా?
ఇప్పుడు ఎక్కడ చూసినా ఎగ్గేరియన్సే..హెల్తీ ఫుడ్‌పై ఎన్నో అనుమానాలు..ఇంతకీ గుడ్డు వెజిటేరియనా? నాన్‌ వెజిటేరియనా?.. కొందరు వెజిటేరియన్ అంటారు. ఇంకొందరు నాన్ వెజిటేరియన్ అంటారు.

గుడ్డు వెజ్.. నాన్‌వెజ్ కాదు. ఇది తెలియక తినడం మానేశారా? అలా ఏం కుదరదు... ఫుల్లుగా లాగించేయండన్న డాక్టర్లనూ మనం చూస్తున్నాం. వారి మాటలు వింటున్నారు. చాలా మంది మాంసాహారం ముట్టని రోజుల్లో, అలాగే పూర్తి శాఖాహారులు అయిన వారు.. గుడ్డుని మాంసాహారంగా భావించి తినడం మానేస్తారు. గుడ్డు కోడి నుంచి వస్తుంది కనుక అది మాంసాహారమనే అనుకుంటారు. మరి అలా చూసినప్పుడు గేదె నుంచి వచ్చే పాలు కూడా మాంసాహారమే కదా? అన్న అభిప్రాయాలూ ఉన్నాయి.

మరి పాలు ఏం పాపం చేశాయి..? గుడ్డు ఏం పుణ్యం చేసింది..? ఆధారాలతో సహా గుడ్డు మాంసాహారం కాదు శాఖాహారమే అని తేల్చేశారు కొందరు శాస్త్రవేత్తలు. గుడ్డులో మూడు భాగాలుంటాయంటున్న శాస్త్రవేత్తలు... గుడ్డులోని తెల్లని భాగంలో ప్రొటీన్లుంటాయి. అందులో ఎలాంటి జంతు పదార్థం ఉండదని చెబుతున్నారు. అంటే ఎగ్‌వైట్ శాకాహారమే కాదు... పచ్చసొనలో అత్యధికంగా ప్రొటీన్లు, కోలెస్ట్రాల్ ఉంటాయని ఓ అంచనాకు వచ్చేశారు.

ఇక్కడే కొన్ని బేధాభిప్రాయాలూ ఉన్నాయి. ఒక కోడి మరో కోడితో సంపర్కం జరిగినప్పుడే ఇది మాంసాహారంగా మారుతుంది. కోడి పుట్టిన ఆరు నెలల తరువాత ఒకటి లేదా రెండు రోజులకు గుడ్డును పెడుతుంది. ఈ ప్రక్రియ కోడిపెట్ట లేదా పుంజుతో సంపర్కం అవసరం లేకుండానే జరుగుతుంది. వీటినే అన్‌ఫెర్టిలైజర్ ఎగ్ అంటారు. సాధారణంగా మార్కెట్‌లో లభించే గుడ్లు అన్‌ఫెర్టిలైజర్ అయి ఉంటాయి. కాబట్టి గుడ్డు గురించి ఏం ఆలోచన లేకుండా లాగించేయవచ్చ అంటారు శాస్త్రవేత్తలు.

Show Full Article
Print Article
Next Story
More Stories