తెలంగాణలో ఆ రెండు పథకాలపై అయోమయం

తెలంగాణలో ఆ రెండు పథకాలపై అయోమయం
x
Highlights

తెలంగాణ సర్కారు ప్రవేశపెట్టిన రెండు పథకాల మ్యాటర్‌పై అయోమయం నెలకొంది. బతుకమ్మ చీరల పంపిణీ, రైతుబంధు చెక్కుల అంశం కేంద్ర ఎన్నికల సంఘం వద్దకు చేరడంతో...

తెలంగాణ సర్కారు ప్రవేశపెట్టిన రెండు పథకాల మ్యాటర్‌పై అయోమయం నెలకొంది. బతుకమ్మ చీరల పంపిణీ, రైతుబంధు చెక్కుల అంశం కేంద్ర ఎన్నికల సంఘం వద్దకు చేరడంతో ఈసీ నిర్ణయం కోసం వేచిచూస్తోంది. పాతపథకాలే కదా అనుమతి ఇవ్వాలని సర్కారు కోరింది. ఖరీఫ్ సీజన్ లో మొదటి విడతగా ఎకరాకు నాలుగు వేల రూపాయలు ఇచ్చిన సర్కార్... రబీ సీజన్ లో రెండో విడతగా మరో నాలుగు వేల రూపాయలు ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ఎన్నికల కోడ్‌ అమలులోకి రావడంతో... ప్రభుత్వం ఎలాంటి విధానపర నిర్ణయాలు, కార్యక్రమాలు కానీ ప్రభావితం చేసే చర్యలు చేపట్టరాదు. దీంతో రైతుబంధు, బతుకమ్మ చీరల పంపిణీ అమలు విషయాన్ని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లారు. రబీ సీజన్ ప్రారంభమవుతోన్నందున రైతులకు పెట్టుబడి సాయం అందించాల్సిన అవసరం ఉందని... రైతుబంధు చెక్కుల పంపిణీకి అనుమతించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తిని రజత్ కుమార్ కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లారు. ఈసీ నిర్ణయానికి అనుగుణంగా పెట్టుబడి సాయాన్ని అందించేందుకు సర్కార్ సిద్ధమవుతోంది. అక్టోబర్ నెలలోనే పంపిణీ ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయాలన్న ఆలోచలో ప్రభుత్వం ఉంది. అటు బతుకమ్మ చీరల పంపిణీ అంశాన్ని కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదించారు. బతుకమ్మ పండగ సందర్భంగా అక్టోబర్ 12వ తేదీ నుంచి 95 లక్షల మందికి చీరలు పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఆపద్ధర్మ ప్రభుత్వం హయాంలో వ్యక్తిగత లబ్ది చేకూర్చేలా చీరల పంపిణీ తగదని... ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి ఫిర్యాదులు అందాయి. దీంతో పథకాల అమలుపై నీలినీడలు కమ్ముకున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories