ప్రజాస్వామ్యానికి నా.. నివాళి.. ఫైనల్ గా తేల్చేసిన విశాల్ భవితవ్యం..!

Highlights

ఆర్కేనగర్ ఉపఎన్నికల్లో బరిలోకి దిగాలని ఉవ్విల్లూరిన పందెంకోడి విశాల్ కి ఎలక్షన్ కమిషన్ నుంచి గట్టి ఎదురుదెబ్బ తగిలింది.. కొంతసేపేమో నామినేషన్...

ఆర్కేనగర్ ఉపఎన్నికల్లో బరిలోకి దిగాలని ఉవ్విల్లూరిన పందెంకోడి విశాల్ కి ఎలక్షన్ కమిషన్ నుంచి గట్టి ఎదురుదెబ్బ తగిలింది.. కొంతసేపేమో నామినేషన్ చెల్లదని, మరికొంతసేపేమో నామినేషన్ విశాల్ నామినేషన్ చెల్లుతుందని దోబూచులాడిన సందర్బంగా విశాల్ కొంత భావోద్వేగానికి లోనయ్యారు.. నిన్న తమిళనాడు అమ్మ జయలలిత చనిపోయినరోజే ప్రజాస్వామ్యం చనిపోయిందని, చనిపోయిన ప్రజాస్వామ్యానికి నా నివాళి అని అన్నారు.. ఎన్నికల కమిషన్ ప్రజల విలువలకు తగ్గట్టుగా పనిచేయాల్సింది పోయి రాజకీయ నేతల అభిప్రాయాలకు తగ్గట్టు పని చేస్తుందని విశాల్ విమర్శించారు.. తమిళ ప్రజలను రాజకీయంగా ఇంకా ఎన్ని రోజులు మోసం చేస్తారని, రాష్ట్రంలోని ప్రతిపేదవాడికి న్యాయం జరగనప్పుడు తనలాంటి సినీ స్టార్లు వస్తారని ఇప్పటికైనా వీళ్లకు బుద్ధి రాలేదంటే ఆ, దేవుడే వచ్చి వీళ్ళను మార్చాలని ఆవేదన వ్యక్తం చేసారు విశాల్..

Show Full Article
Print Article
Next Story
More Stories