పార్టీ గుర్తుపై జనసైనికుల్లో సంబరం

x
Highlights

జన సేన పార్టీకి సింబల్ వచ్చింది. గాజు గ్లాసు గుర్తు కేటాయిస్తున్నట్లు ఈసీ ప్రకటించింది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఇదే గుర్తుపై జనసేన పోటీ...


జన సేన పార్టీకి సింబల్ వచ్చింది. గాజు గ్లాసు గుర్తు కేటాయిస్తున్నట్లు ఈసీ ప్రకటించింది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఇదే గుర్తుపై జనసేన పోటీ చేయనుంది. సామాన్యుడికి నిత్యం కనిపించే గాజు గ్లాసు గుర్తు కేటాయించడంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈసీకి కృతజ్ఞతలు తెలిపారు. పవర్ కోసం కాదు ప్రశ్నించడం కోసం అంటూ జనంలోకి వచ్చిన జనసేనకు పార్టీ సింబల్ లభించింది. జనసేన పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం గాజు గ్లాస్ గుర్తు కేటాయించింది. ఏపీ , తెలంగాణ రాష్ట్రాల్లో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఈ గుర్తుతో పోటీ చేయవచ్చని ఎన్నికల సంఘం ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల్లోని 42 పార్లమెంట్ స్థానాలతో పాటు ఏపీలోని 175 అసెంబ్లీ స్థానాల్లో జనసేన గాజు గ్లాసు గుర్తుతో పోటీ చేయవచ్చు.

జనసేన నాలుగు నెలల క్రితం ఎన్నికల గుర్తు కేటాయించాలని ఎన్నికల సంఘాన్ని కోరింది. మూడు గుర్తులు రిక్వెస్ట్ చేశారు అధినేత పవన్. వాటిలో పిడికిలి, గాజు గ్లాస్, బకెట్ వంటి మూడు గుర్తుల్లో ఏదో ఒకటి కేటాయించాలని కోరారు. అయితే పిడికిలి గుర్తు కోసం పార్టీ తీవ్ర ప్రయత్నం చేసింది. ఇటీవల ఏలూరు ప్రజాపోరాట యాత్రలో మన గుర్తు పిడికిలి అంటూ ప్రకటించారు. దీంతో పిడికిలి గుర్తు వస్తుందనుకున్నారు అంతా. కానీ పిడికిలి గుర్తు ఇచ్చేందుకు వీలు లేకపోవడంతో గాజు గ్లాసు గుర్తును కేటాయిస్తున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. గాజు గుర్తు కేటాయించడంపై జనసేన పార్టీ హర్షం వ్యక్తం చేస్తుంది. సామాన్యుడి గుర్తుగా గాజు గ్లాస్ గుర్తు పార్టీకి మంచిదని భావిస్తున్నారు. పవన్ పార్టీ పెట్టక ముందు ఎర్ర టవల్, టీ గ్లాస్ తన సినిమాల్లో ఎక్కువగా వాడుతుండేవారు. అభిమానులతో పాటు జనసేన కార్యకర్తలు వీటిపట్ల ఆకర్షితులయ్యారు. అదే టీ గ్లాసును పోలిన గాజు గ్లాసు గుర్తును కేటాయించడంతో పార్టీలోనూ కార్యకర్తల్లోనూ ఉత్సాహం పెరిగింది. గాజు గ్లాస్ అంటూ సామాన్యుడికి నిత్యం కనిపించే గుర్తు పార్టీకి ప్లస్ అవుతుందంటున్నారు. వచ్చే ఎన్నికలకు సిద్ధమవుతున్న జనసేనకు వారు కోరుకున్న గుర్తే రావడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక పార్టీ సిద్ధాంతాలు, ఎన్నికల మేనిఫెస్టో తో పాటు గుర్తుని ప్రజల్లోకి తీసుకెవెళ్లేందుకు రెడీ అవుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories