సెప్టెంబర్‌ రెండో వారంలో తెలంగాణ అసెంబ్లీ రద్దు..?

సెప్టెంబర్‌ రెండో వారంలో తెలంగాణ అసెంబ్లీ రద్దు..?
x
Highlights

తెలంగాణలో ముందస్తు ఎన్నికలు ఉంటాయని పార్టీ నేతలకు సీఎం కేసీఆర్‌ సంకేతాలు ఇస్తున్నారు. టీఆర్‌ఎస్‌ విస్తృతస్థాయి సమావేశంలో.. ఎన్నికలు ఏ క్షణమైనా...

తెలంగాణలో ముందస్తు ఎన్నికలు ఉంటాయని పార్టీ నేతలకు సీఎం కేసీఆర్‌ సంకేతాలు ఇస్తున్నారు. టీఆర్‌ఎస్‌ విస్తృతస్థాయి సమావేశంలో.. ఎన్నికలు ఏ క్షణమైనా రావొచ్చు సిద్ధంగా ఉండాలని సూచించారు. ఎన్నికల విషయంలో పూర్తిగా నా నిర్ణయమే ఫైనల్ అని సీఎం అన్నట్టు ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా ఈ సమావేశంలో సెప్టెంబర్ లో నిర్వహించతలపెట్టిన ప్రగతి నివేదన సభపైనే ప్రధానంగా చర్చ జరిగింది. సంక్షేమ పథకాల లబ్దిదారులందరూ సభకు వచ్చేలా చూడాలని.. నిత్యం ప్రజల్లోనే ఉండాలని పార్టీ కేడర్ ఆదేశాలు జారీ చేశారు సీఎం. ప్రగతి నివేదన సభకు ప్రతి నియోజకవర్గం నుంచి కనీసం 25 వేల మందిని రప్పించాలని ప్రజా ప్రతినిధులకు సీఎం సూచించారు. తెలంగాణలో ముందస్తు (డిసెంబర్ లోనే) ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించుకుంటే అంతకంటే ముందే సెప్టెంబర్‌ రెండో వారంలో అసెంబ్లీని రద్దు చేయాల్సి ఉంటుందని.. ఈ విషయాలన్నింటికీ సీఎం ఢిల్లీ పర్యటన తరువాత క్లారిటీ వచ్చే అవకాశముంది.

Show Full Article
Print Article
Next Story
More Stories