తెలంగాణలో నవంబర్ లోపే ఎన్నికలు?

తెలంగాణలో నవంబర్ లోపే ఎన్నికలు?
x
Highlights

తొమ్మిది నెలల ముందుగానే తెలంగాణ అసెంబ్లీని రద్దు చేయడంతో ముందస్తు ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయన్న విషయంలో సందిగ్ధత నెలకొంది. ఈ క్రమంలో ఆపద్ధర్మ...

తొమ్మిది నెలల ముందుగానే తెలంగాణ అసెంబ్లీని రద్దు చేయడంతో ముందస్తు ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయన్న విషయంలో సందిగ్ధత నెలకొంది. ఈ క్రమంలో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ నవంబర్ లోపే ఎన్నికలు ఉంటాయని చెప్పగా.. ఈ ఏడాది నవంబర్‌లోనే రాష్ట్రంలో శాసనసభకు ఎన్నికలు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు ముమ్మరం చేసింది. నవంబర్‌లోనే ఎన్నికలు జరిపేలా ఓటర్ల జాబితాను సవరించింది. సాధారణ షెడ్యూల్‌ కంటే మూణ్నెల్ల ముందుగానే ఈ ప్రక్రియను పూర్తి చేసే దిశగా చర్యలు చేపట్టింది. ఈనెల 10న ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల చేసి.. దానిపై అభ్యంతరాలు స్వీకరించిన తర్వాత అక్టోబర్‌ 8న తుది జాబితా ప్రకటించనున్నట్టు సమాచారం.

Show Full Article
Print Article
Next Story
More Stories