అనుమానాలుంటే మా ఆఫీస్‌కు రండి

మహేష్ బాబు హీరోగా, కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన 'భరత్ అనే నేను' చిత్రం సంచలన విజయం సాధించింది. ఈ సినిమాను...
మహేష్ బాబు హీరోగా, కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన 'భరత్ అనే నేను' చిత్రం సంచలన విజయం సాధించింది. ఈ సినిమాను డీవీవీ దానయ్య నిర్మించారు. అయితే, సినిమా కోసం పని చేసిన కొందరికి దానయ్య రెమ్యునరేషన్ చెల్లించలేదనే వార్తలు వెలువడ్డాయి. కొరటాల శివ, హీరోయిన్ కైరా అద్వానీలకు ఆయన పూర్తి రెమ్యునరేషన్ చెల్లించలేదనే వార్తలు ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతున్నాయి.
దీంతో తాజాగా దానయ్య ఓ ప్రకటన విడుదల చేశారు.`మా నిర్మాణ సంస్థ మీద వచ్చిన నిరాధారమైన ఆరోపణలు మమ్మల్ని ఎంతో బాధించాయి. `భరత్ అనే నేను`లాంటి బ్లాక్‌బస్టర్ చిత్రానికి పనిచేసినందుకు మేము, మా టీమ్ అంతా ఎంతో గర్వపడుతుంటాం. ఈ సినిమా కోసం పనిచేసిన నటీనటులు, సాంకేతిక నిపుణులందరికీ పారితోషికాలు చెల్లించాం. ఈ విషయంలో ఎవరికైనా అనుమానాలు ఉంటే హైదరాబాద్‌లోని మా కార్యాలయానికి గాని, మా సినిమాలో పనిచేసిన నటీనటులను గాని సంప్రదించవచ్చు. ఇకపై ఇలాంటి ఊహాజనిత వార్తలు ప్రచురించవద్దని జర్నలిస్టులకు విజ్ఞప్తి చేస్తున్నాన`ని దానయ్య ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
మోడీకి కేసీఆర్ వెల్కమ్ చెప్పకపోవడానికి రీజన్!
25 May 2022 12:30 PM GMTతెలంగాణలో బీజేపీ కార్యక్రమాల్లో ప్రధాని ఎందుకు పాల్గొనడం లేదు?
25 May 2022 12:03 PM GMTక్రికెటర్ దిగ్గజం సచిన్ కొడుకు అర్జున్‌కు మళ్లీ నిరాశే.. దక్కని ఛాన్స్...
25 May 2022 4:45 AM GMTఐపీఎల్ సీజన్ 15 లో ఫైనల్ కు గుజరాత్ జట్టు.. సిక్స్ లతో చెలరేగిన డేవిడ్ మిల్లర్...
25 May 2022 4:04 AM GMTదావోస్‌లో కలుసుకున్న ఏపీ సీఎం జగన్, మంత్రి కేటీఆర్...
24 May 2022 4:30 AM GMTపొగలు కక్కుతూ సెగలు రేపుతున్న స్మోక్ బిస్కెట్స్.. న్యూ ఫీలింగ్.. నో సైడ్ ఎఫెక్ట్స్...
24 May 2022 4:11 AM GMTసడన్‌గా హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఏం జరిగింది..?
24 May 2022 3:33 AM GMT
CM KCR: ఇవాళ బెంగళూరుకు సీఎం కేసీఆర్... మాజీ ప్రధాని దేవెగౌడతో భేటీ
26 May 2022 1:42 AM GMTఏపీలో నేటి నుంచి మంత్రుల బస్సు యాత్ర
26 May 2022 1:09 AM GMTమహేష్ బాబు కోసం స్టార్ హీరో ని విలన్ గా మార్చనున్న రాజమౌళి
25 May 2022 4:00 PM GMTకరీంనగర్ లో ఒవైసీకి బండి సవాల్
25 May 2022 3:45 PM GMTప్రగతి భవన్లో సీఎం కేసీఆర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపిన రాజ్యసభ...
25 May 2022 3:30 PM GMT