ఎస్సై రాసలీలలను బట్టబయలు చేసిన అగ్నిప్రమాదం

పోలీసు శాఖలో అక్రమ సంబంధాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. ఇటీవల బెంగళూరు గ్రామీణ జిల్లా ఎస్పీగా పని చేసిన...
పోలీసు శాఖలో అక్రమ సంబంధాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. ఇటీవల బెంగళూరు గ్రామీణ జిల్లా ఎస్పీగా పని చేసిన ఐపీఎస్ అధికారి ఓ టెక్కీ భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నారని వెలుగు చూసిన మూడు రోజులకే మరో భాగోతం వెలుగు చూసింది. బళ్ళారికి చెందిన కిరణ్ సామ్రాట్ పరమదేవనహళ్లి ఎస్పీ ఆఫీసు వైర్‌లెస్ విభాగంలో ఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో అతను ఓ పోలీస్ కానిస్టేబుల్ భార్యపై కన్నేసాడు. ఆమెను మెల్లగా లొంగదీసుకుని వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో గత బుధవారం రాత్రి ఇద్దరూ కలిసి గదిలో వున్నారు. తాగిన మైకంలో ఉన్న ఎస్‌ఐ కిరణ్ సామ్రాట్ సిగరెట్ కాల్చుతూ నిప్పురవ్వలను కింద పడేయసాగాడు. అవి కాస్తా సోఫాసెట్ మీద పడి నిప్పు రాజుకుంది. ఆ మంట కాస్తా పెద్దదై ఇంట్లో ఇతర సామగ్రికి అంటుకుంది.
దీంతో మంటలు పెద్దవయ్యాయి. ఇతర క్వార్టర్స్‌లో వుండే వాళ్ళంతా కంగారుగా వచ్చి చూశారు. ఎస్‌ఐ, కానిస్టేబుల్ భార్య భయంతో ఒకేసారి ఇంట్లో నుంచి బయటకు రావడంతో వాళ్ళంతా ముక్కన వేలేసుకున్నారు. ఈ ఘటనతో వారి మధ్య ఉన్న వివాహేతర సంబంధం గుట్టు రట్టయింది. ఈ ప్రమాదంపై కానిస్టేబుల్ ఇద్దరి మీద స్థానిక గాంధీనగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఎస్సైని, కానిస్టేబుల్ భార్యను అరెస్టు చేశారు. కానిస్టేబుల్ భార్యకు ఇద్దరు పిల్లలు వున్నారు.
జనసేనలోకి వెళ్తున్న ప్రచారాలను ఖండించిన బాలినేని
10 Aug 2022 7:08 AM GMTప్రకాశం బ్యారేజీకి భారీగా చేరుతున్న వరద
10 Aug 2022 5:45 AM GMTహైదరాబాద్‌కు రానున్న టీకాంగ్రెస్ ఇన్చార్జ్ మాణిక్కం ఠాగూర్
10 Aug 2022 5:32 AM GMTబిహార్‌లో రోజంతా నాటకీయ పరిణామాలు
10 Aug 2022 2:19 AM GMTనల్గొండ జిల్లాలో కొనసాగుతున్న ప్రజా సంగ్రామ యాత్ర
10 Aug 2022 1:12 AM GMTSinkhole: భారీగా పెరుగుతున్న వింత గొయ్యి లోతు..
9 Aug 2022 3:00 PM GMTMLA Raja Singh: డేట్ రాసి పెట్టుకోండి.. వందశాతం నన్ను చంపేస్తారు..
9 Aug 2022 12:14 PM GMT
కేసీఆర్ జిల్లాల పర్యటనకు రంగం సిద్ధం
11 Aug 2022 1:06 AM GMTనుపుర్ శర్మకు సుప్రీం కోర్టులో ఊరట
10 Aug 2022 4:00 PM GMTHealth Tips: ఇవి తింటే మీ పని అంతే.. ఎంత నష్టం జరుగుతుందంటే..?
10 Aug 2022 3:30 PM GMTమోహన్ బాబుని ట్రోల్ చేస్తున్న సాయిబాబా భక్తులు
10 Aug 2022 3:15 PM GMTPriyanka Gandhi: కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీకి మరోసారి కరోనా
10 Aug 2022 3:00 PM GMT